
కానీ రవీంద్ర జడేజా మాత్రం తన అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టేసాడు అని చెప్పాలి. వరుసగా రెండు మ్యాచ్లలో కూడా బంతితో, బ్యాట్ తో కూడా రాణించి రెండు మ్యాన్ అఫ్ ది మ్యాచ్లను అందుకున్నాడు రవీంద్ర జడేజా. దీంతో రీ ఎంట్రీ తర్వాత అతను మరింత అత్యుత్తమమైన ఫామ్ లో కొనసాగుతున్నాడు అని ఎంతోమంది మాజీ ఆటగాళ్లు కూడా ప్రశంసలు వర్షం కురిపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ అయిన రవీంద్ర జడేజాకు ఆటపట్ల ఎంతో అంకితభావం ఉంది అన్న విషయాన్ని జడేజా భార్య రివాబా జడేజా ఇటీవల చెప్పుకొచ్చారు.
తన భర్త జడేజాకు అన్నింటికంటే క్రికెట్ ఎక్కువ అంటూ చెప్పుకొచ్చింది. ఆటపై తన భర్తకు అమితమైన అంకితభావం ఉంది అంటూ తెలిపింది. ఇక తనకంటే క్రికెట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రివాబా జడేజా. ఇక జడేజా గాయం నుంచి కోలుకొని మళ్ళీ తిరిగి మైదానంలోకి అడుగు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక జడేజా ఆటపట్ల ఎంతో నిబద్ధతతో ఉంటాడు. అదే ఆయన బలం కూడా. దేశం తరపున ఆడటానికి తొలి ప్రాధాన్యత ఇస్తాడు. ఎప్పుడు తక్కువగా మాట్లాడే జడేజా తనను విమర్శించే వాళ్ళకి తన ఆట తీరుతోనే సమాధానం చెబుతాడు. లోపాలపై దృష్టి పెట్టి ముందుకు సాగుతాడు అంటూరి రివాబా చెప్పుకొచ్చింది.