కేఎల్ రాహుల్ ప్రస్తుతం భారత జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. మొన్నటి వరకు అటు కెప్టెన్ రోహిత్ శర్మకు డిప్యూటీగా వైస్ కెప్టెన్సీ బాధ్యతలను కూడా చేపట్టాడు. అయితే ఓపెనర్ గా బరిలోకి దిగుతూ ఎప్పుడు తన ఆట తీరుతో ఇక జట్టుకు మంచి శుభారంబాలు  అందిస్తూ ఉంటాడు కేఎల్ రాహుల్. కానీ గత కొంతకాలం నుంచి మాత్రం వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే టీమిండియా యాజమాన్యం అతనిపై నమ్మకం ఉంచి ఎన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ మళ్ళీ మునుపటి ఫామ్ అందుకోలేకపోతున్నాడు.


 ఇక ఇటీవలే ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలకమైన టెస్ట్ సిరీస్లో కూడా కేఎల్ రాహుల్ వైఫల్యం కొనసాగింది. దీంతో అతనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ముందుగా అతని వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించిన టీమిండియా యాజమాన్యం ఆ తర్వాత జట్టు నుంచి కూడా పక్కనపెట్టి అతని స్థానంలో శుభమన్ గిల్ కు అవకాశం కల్పించింది. అయితే కేఎల్ రాహుల్ స్థానంలో వచ్చిన శుభమన్ గిల్ కూడా తన ప్రదర్శనతో ఎక్కడ ఆకట్టుకోలేకపోతున్నాడు అని చెప్పాలి. కాగా ఇప్పటికే ఆస్ట్రేలియా భారత్ మూడు టెస్ట్ మ్యాచ్ లు ముగిసాయి.


 ఇక భారత ఆస్ట్రేలియా మధ్య మార్చి 9వ తేదీ నుంచి చివరి టెస్ట్ ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే స్ట్రైక్ రేట్ పై టీమ్ ఇండియా బ్యాట్స్మెన్ కే ఎల్ రాహుల్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫార్మాట్ ఏదైనా సరే స్ట్రైక్ రేట్ అనేది కీలకమైనప్పటికీ.. అతిగా అంచనా వేయడం సరికాదు అంటూ వ్యాఖ్యానించాడు. మ్యాచ్ను బట్టి దూకుడుగా ఆడాల్సి ఉంటుంది అంటూ తెలిపాడు.  స్ట్రైక్ రేట్ కోసం దూకుడుగా ఆడితే వికెట్ కోల్పోయే ప్రమాదం ఉంది అంటూ కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: