
దీంతో క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆటగాళ్లు ఎవరైనా సరే బంతిని షైనింగ్ చేసేందుకు లాలాజలం రుద్దితే చర్యలు తీసుకుంటాము అంటూ కూడా హెచ్చరించింది అని చెప్పాలి. అయితే ఇప్పటికీ కూడా ఇక ఈ నిబంధనలను సవరించలేదు ఐసిసి. ఇక ఇదే విషయంపై సచిన్ టెండూల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కరోనా వైరస్ సమయంలో ఐసీసీ తీసుకున్న నిర్ణయం సరైనదేనని.. కానీ ఇప్పుడు మాత్రం బౌలర్లకు వెసులుబాటు కల్పించాలి అంటూ సూచించారు.
పరిశుభ్రత గురించి చాలామంది ఆలోచిస్తున్నారు. బౌలర్లు చెమట కోసం బంతిని చంకల్లో పెట్టుకుంటున్నారు. ఇది బాగుంటుందా.. అలాంటప్పుడు లాలాజలం పెట్టడం పై అభ్యంతరం ఎందుకు.. బంతి కొత్తగా ఉన్నప్పుడు లాలాజలం చాలా ముఖ్యం. చెమటకంటే లాలాజలానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒకవైపు ఎక్కువగా పెడతారు.. మరొకవైపు తక్కువగా వాడుతారు. ఇలా బంతి సమతూకంగా లేకపోవడం వల్ల స్వింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది అంటూ సచిన్ టెండూల్కర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే ఇంతకుముందు ఆస్ట్రేలియా కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ సైతం ఇక ఇలాంటి సూచన చేశాడు అని చెప్పాలి. ఇక దీనిపై ఐసీసీ ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా లేదా అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది.