టీమిండియాలో సీనియర్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్ గత కొంతకాలం నుంచి ఎంతలా విమర్శలు ఎదుర్కొంటున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియా అతనికి వరుసగా అవకాశాలు ఇస్తూ వచ్చినప్పటికీ కూడా ఇక మునుపటి ఫామ్ ను అందుకోలేకపోయాడు. వరుస వైఫల్యాలతో ఒక రకంగా ఇక జట్టుకు మైనస్ గా మారిపోయాడు అని చెప్పాలి. అయితే అతనికి అవకాశాలు ఇచ్చి విసిగిపోయిన బీసీసీఐ ముందుగా వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించి ఇక ఆ తర్వాత జట్టులో కూడా వేటు వేసింది అని చెప్పాలి.


 అయితే కేఎల్ రాహుల్ను తప్పించడంతో ఎంతోమంది అభిమానులు కూడా నిరాశలో మునిగిపోయారు. ఇక అతను మళ్లీ మునుపటి ఫామ్ అందుకుని జట్టులోకి వస్తాడా లేదా అని ఆందోళన చెందారు అని చెప్పాలి. అయితే చివరి రెండు టెస్ట్ మ్యాచ్లో అతన్ని పక్కకు పెట్టిన టీమిండియా యాజమాన్యం వన్డే సిరీస్ లో మాత్రం మరోసారి జట్టులో ఛాన్స్ ఇచ్చింది. అయితే ఇక ఇటీవలే ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో కేఎల్ రాహుల్ తన ప్రదర్శనతో విమర్శకుల నోళ్లు మూయించాడు  అని చెప్పాలి. ఏకంగా 75 పరుగులతో జట్టు విషయంలో కీలక పాత్ర వహించాడు 189 పరుగుల స్వల్ప టార్గెట్ తో టీం ఇండియా బరులోకి దిగినప్పటికీ ఇక మొదట్లోనే కీలకమైన వికెట్లు కోల్పోయింది. ఇక 37 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న వేళ కేఎల్ రాహుల్ మంచి ఇన్నింగ్స్ ఆడి 75 పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర వహించాడు. అయితే కేఎల్ రాహుల్ మునిపా
టి ఫామ్ లోకి రావడంతో ప్రస్తుతం కె ఎస్ భరత్ కెరియర్ ప్రమాదంలో పడింది. ఎందుకంటే అతడు మునుపటి ఫామ్ లోకి వస్తే ఇక కె.ఎస్ భరత్కు జట్టులో చోటు దక్కడం  చాలా కష్టం అని చెప్పాలి. ఎందుకంటే కేఎల్ రాహుల్ ని కూడా అటు వికెట్ కీపర్ కం బ్యాట్స్మెన్ గా పరిగణిస్తూ ఉంటారు. ఇక అతను బాగా రాణించాడు అంటే మరో వికెట్ కీపర్ కం బ్యాట్స్మెన్ అయిన అటు భరత్ మాత్రం జట్టులో కనిపించడం కష్టమే అన్నది తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: