
దీన్నిబట్టి చూస్తే సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ విధ్వంసం ఏ రేంజ్ లో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇక మైదానం నలుమూలల్లో కూడా ఎంతో అద్భుతమైన షాట్లు ఆడుతూ ఉంటాడు సూర్య కుమార్ యాదవ్. దీంతో ఇక ప్రపంచ క్రికెట్లో నయా 360 ప్లేయర్ గా కూడా గుర్తింపును సంపాదించుకున్నాడు అని చెప్పాలి. అయితే టి20 ఫార్మాట్లో ఇలా తనకు తిరుగులేదు అని నిరూపించుకున్న సూర్య కుమార్ యాదవ్ వన్డే ఫార్మాట్లో మాత్రమే పూర్తిగా తేలిపోతున్నాడు అన్నది తెలుస్తుంది. దూకుడు అయిన ఆటతీరుకు మారుపేరైన సూర్య వన్డే ఫార్మాట్లో అస్సలు ఇమడలేకపోతున్నాడు అన్నది అతని వైఫల్యాలు చూస్తే అర్థమవుతుంది.
ఇక ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో కూడా సూర్య కుమార్ యాదవ్ ఏకంగా గోల్డెన్ డకౌట్ గా వెనుతిరిగి అభిమానులందరినీ కూడా నిరాశపరిచాడు. ఇక గత పది మ్యాచ్లలో చూసుకుంటే 13, 9, 8, 4, 34, 6, 4, 31, 14,0 స్కోర్లు చేశాడు అని చెప్పాలి. ఒక మ్యాచ్లో కూడా హాఫ్ సెంచరీ మార్కుని అందుకోలేకపోయాడు. అంతేకాదు ఆరుసార్లు కూడా సింగిల్ డిజిట్ స్కోర్కె పెవిలియన్ చేరాడు. అయితే వాస్తవానికి వన్డే జట్టులో అతనికి చోటు లేదు. కానీ సూర్య కుమార్ యాదవ్ గాయపడిన నేపథ్యంలో అతన్ని జట్టులోకి తీసుకున్నారు. కానీ అతను మాత్రం వన్డే ఫార్మట్ లో రాణించడం లేదు. దీంతో సూర్యకుమార్ కేవలం టి20 లకే సరిపోతాడు అని వాదన కూడా తెరమీదకి వస్తుంది.