
ఇక ప్రతిసారి కూడా అటు విరాట్ కోహ్లీ ఇక ఒకప్పటిలా మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించే లాగా భారీ పరుగులు చేయలేకపోతున్నాడు. ఇక విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడు ఇలా వరుసగా వైఫల్యం చెందుతూ ఉండడం మాత్రం అటు జట్టుకు మైనస్ గా మారిపోతుంది అని చెప్పాలి. ఇక ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ వన్డే మ్యాచ్ లో కూడా కీలకమైన సమయంలో విరాట్ కోహ్లీ జట్టును ఆదుకోవాల్సింది పోయి వికెట్ కోల్పోయాడు. ముఖ్యంగా కోహ్లీ అవుట్ అయిన తీరుపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి.
ఇక ఇటీవల ఇదే విషయంపై భారత లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించారు. రెండో వన్డే మ్యాచ్లో విరాట్ కోహ్లీ అవుట్ అయిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసాడు. చేసిన తప్పేంటో విరాట్ కోహ్లీకి బాగా తెలుసు. ఇక ఇటీవలే చాలా మ్యాచులలో కూడా కోహ్లీ ఇలాగే అవుట్ అవుతున్నాడు. స్క్వేర్ లెగ్ వైపు ఆడేందుకు ప్రయత్నించడం వల్ల ఇలా జరుగుతుంది. మిడాన్ మీదుగా ఆడితే ఇబ్బందులు ఉండవు అంటూ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. కాగా మొదటి వన్డే మ్యాచ్ లోను విరాట్ కోహ్లీ ఇక ఇలాంటి బంతికే ఎల్పి అవుట్ గా వెను తిరిగాడు అని చెప్పాలి.