రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మరోసారి అభిమానులందరినీ కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఇప్పటికే 15 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో ప్రతిసారి భారీ అంచనాల మధ్య బరిలోకి దిగి ఇక లీగ్ దశ నుంచే ఎన్నోసార్లు నిష్క్రమించి విమర్శలు ఎదుర్కొంది. జట్టులో స్టార్ ప్లేయర్లు ఉన్న ఇక జట్టుకు కెప్టెన్లు మారినా కూడా ఆ జట్టును దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరి భావన. కొన్ని కొన్ని సార్లు లీగ్ దశలో మంచి ప్రదర్శన చేసిన చివరికి నాకౌట్ దశలో మాత్రం అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓడిపోయి వెను తిరగడం కూడా జరిగింది అని చెప్పాలి.


 అయితే ఈ బ్యాడ్ లక్  కేవలం ఐపిఎల్ లోనే కాదు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కూడా బెంగళూరు జట్టును వెంటాడింది. భారీ అంచనాల మధ్య స్మృతి మందాన కెప్టెన్సీ లో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు.. ఐపిఎల్ కు మించిన వైఫల్యాన్ని ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కొనసాగించింది. మొత్తంగా ఏడు మ్యాచ్లలో కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించి ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా నిలిచింది. అయితే అంతకు ముందు వరుసగా ఐదు మ్యాచ్లలో ఓటమి చవి  చూడటం గమనార్హం. స్మృతి మందాన తన కెప్టెన్సీలో ఎక్కడ ప్రభావం చూపలేకపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక స్మృతి మందానను టార్గెట్ చేస్తూ ఎంతో మంది ఆర్సీబీ ఫ్యాన్స్ విమర్శలు కూడా చేస్తున్నారు. ఇక ఇటీవల స్మృతి మందాన గురించి ఒక ఆసక్తికర విషయం వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో మృతి మందాన చేసిన మొత్తం పరుగుల విలువ చూసుకుంటే ఒక్కో పరుగుకి దాదాపు రెండు లక్షల విలువ ఉంది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఆర్సిబి స్మృతి మందానాని 3.4 కోట్లు పెట్టి భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే ఈ సీజన్లో 149 పరుగులు చేసింది. దీంతో ఇక స్మృతి మందాన ఒక్కో  పరుగు ధర రెండు లక్షల రూపాయలుగా మారింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl