
ఆ విధంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఫైనల్ కు దూసుకెళ్ళగా , ప్లే ఆఫ్ స్టేజ్ లో ఎలిమినేటర్ లో ముంబై ఇండియన్స్ మరియు యూపీ వారియర్స్ లు తలపడనున్నాయి. ఇక రాయల్ ఛాలెంజెర్స్ బెంగుళూరు మరియు గుజరాత్ జెయింట్స్ జట్లు మాత్రం ఇంటిదారి పట్టాయి. కాగా ఈ రోజు నావి ముంబైలోని డి వై పాటిల్ స్టేడియం లో ఈ రెండు జట్ల మధ్యన మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన యూపీ వారియర్స్ కెప్టెన్ అలీసా హీలీ తెలివిగా ఫీల్డింగ్ ను ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశాలు ఎక్కువగా యూపీ కే ఉన్నాయని చెప్పాలి.
యూపీ వారియర్స్ లో కెప్టెన్ అలీసా హీలీ , ఆల్ రౌండర్ మెక్ గ్రాత్ , కిరణ్ , దీప్తి శర్మ , ఎక్లస్టన్ , హరీష్ లు కనుక అంచనాలకు తగిన విధంగా రాణిస్తే విజయం ఏమీ కష్టం కాదు. కానీ ముంబై ఇండియన్స్ లో చాలా మంది అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉండడం వారికి కలిసి వచ్చే అంశం. మరి ఈ లీగ్ ఆసాంతం అద్భుతంగా రాణిస్తున్న ముంబై బ్యాటర్ లు భాటియా , మాత్యుస్, హర్మన్ ప్రీత్ కౌర్ మరియు నటాలీ సీవర్ లను ఏ విధంగా యూపీ బౌలర్లు అడ్డుకుంటారో చూడాలి. ఈ రెండు టీం లలో ఎవరు గెలిచి ఫైనల్ లో ఢిల్లీ తో తలపడతారో తెలియాలంటే కాసేపు ఆగాల్సిందే.