ప్రపంచ క్రికెట్లో పాకిస్తాన్ ఆటగాళ్ల తీరు ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతోంది. కొన్ని కొన్ని సార్లు ఇక తాము కూడా ప్రపంచ క్రికెట్లో అందరితో పాటే పటిష్టమైన జట్టుగా కొనసాగుతూ ఉన్నాం అన్న విషయాన్ని ఇక తమ ఆట తీరుతో  నిరూపిస్తూ ఉంటారు. నిజమే పాకిస్తాన్ ప్లేయర్లు అత్యుత్తమ ప్రదర్శన చేస్తారు అనే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అనుకునే లోపే మళ్ళి పేలవ  ప్రదర్శనతో నిరాశ పరుస్తూ ఉంటారు. అందుకే పాకిస్తాన్ ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయంపై అటు విశ్లేషకులు కూడా ఒక అంచనాకు రాలేకపోతుంటారు అని చెప్పాలి.


 గెలిచే మ్యాచ్లలో ఓడిపోవడంలో ఇక ఓడిపోవాల్సిన మ్యాచ్లలో పుంజుకుని గెలవడంలో మిగతా జట్లతో పోల్చి  చూస్తే అటు పాకిస్తాన్ ఆటగాళ్లు ముందుంటారు అని చెప్పాలి. అయితే గత కొంతకాలం నుంచి మాత్రం వరుసగా పరాజయాలు మూటగట్టుకుంటున్న పాకిస్తాన్ జట్టు.. తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది. మొన్నటికి మొన్న స్వదేశంలో జరిగిన వరస సిరీస్లలో ఓడిపోయి విమర్శలు ఎదుర్కొన్న జట్టు.. ఇక ఇప్పుడు యూఏఈ వేదికగా ఆఫ్ఘనిస్తాన్  తో టి20 సిరీస్ ఆడుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే మొదటిసారి ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమిది చవిచూసింది పాకిస్తాన్ జట్టు.


 ఇటీవల పాకిస్తాన్తో జరిగిన టి20 మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది అని చెప్పాలి. కాగా పాకిస్తాన్ పై ఇప్పటివరకు ఆఫ్ఘనిస్తాన్ ఒక విజయాన్ని కూడా సాధించలేదు. ఇక ఇదే మొదటి విజయం కావడం గమనార్హం. కాగా ఈ మ్యాచ్ లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ను 20 ఓవర్లలో 92 పరుగులకే కట్టడం చేసింది. ఇక తక్కువ టార్గెట్ కావడంతో 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించింది ఆఫ్ఘనిస్తాన్ జట్టు.  మహమ్మద్ నబీ బౌలింగ్లో రెండు వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్లో 38 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర వహించాడు. అయితే చిరకాల ప్రత్యర్థి  అయిన పాకిస్తాన్ పై చారిత్రాత్మక విజయం సాధించడంతో ఆఫ్గనిస్తాన్ అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: