మహిళల ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ ఈ రోజుతో ముగిసింది. ఈ రోజు ముంబై ఇండియన్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్ ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆఖరి ఓవర్ వరకు సాగినా చివరికి ముంబై ఇండియన్స్ నే విజయం వరించింది. 20 ఓవర్ లో మూడు బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో మ్యాచ్ ను గెలుచుకుని WPL మొదటి టైటిల్ ను ముంబై ఇండియన్స్ గెలుచుకుంది. మొదట టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మెగ్ లానింగ్ బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ అనుకున్న విధంగా ఢిల్లీ ఇన్నింగ్స్ సాగలేదు.

ముంబై లాంటి స్ట్రాంగ్ బౌలింగ్ ఉన్న జట్టుపై ఢిల్లీ ప్లేయర్స్ తడబడ్డారు. వరుసగా వికెట్లు కోల్పోయి ఈ దశలోనూ ముంబై ముందు ఛాలెంజింగ్ టార్గెట్ ఇచ్చేలా కనిపించలేదు. సెఫాలి వర్మ (11), కాప్సి (0), రోడ్రిగస్ (9), కప్ (18), జొనసెన్ (2), అరుంధతి రెడ్డి (0) ఇలా అందరూ ఏ మాత్రం ముంబై బౌలింగ్ ను తట్టుకోలేక పెవిలియన్ కు క్యు కట్టారు. ఒకవైపు కెప్టెన్ లానింగ్ మాత్రమే 35 పరుగులతో మంచి స్కోర్ చేసేలా కనిపించినా జోనసెన్ చేసిన తప్పిడంతో కీలక సమయంలో రన్ ఔట్ గా వెనుతిరిగింది.

అయితే 100 లోపు ఆల్ ఔట్ కావాల్సిన ఢిల్లీ ను రాధా యాదవ్ (27) మరియు శిఖ పాండే (27) లు తమదైన ఆల్ రౌండ్ స్కిల్ తో ఆఖరి వికెట్ కు 52 పరుగులు జోడించి జట్టుకు పోరాడే స్కోర్ 131 ను సాధించారు. ముంబై బౌలర్లలో మాథ్యూస్ మరోసారి రాణించి 3 వికెట్లను తీసుకోగా, ఇస్సీ వాంగ్ ఈ సీరీస్ లో తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తోంది. 132 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కు పవర్ ప్లే లోనే 2 వికెట్లు కోల్పోయి ప్రమాదంలో పడింది. కానీ నటాలీ సివర్ మరియు హర్మన్ ప్రీత్ కౌర్ లు చాలా అనుభవంతో మరో వికెట్ పడకుండా మ్యాచ్ ను ఢిల్లీ నుండి లాగేసుకున్నారు.

వీరిద్దరూ మూడవ వికెట్ కు 72 పరుగులు జోడించారు. ఆ తర్వాత అనూహ్య రీతిలో హర్మన్ (37) ఔట్ అయినా అమెలియా కర్ తో కలిసి నటాలీ (60) మ్యాచ్ ను మరో మూడు బంతులు వుండగానే ముగించింది. ముంబై ఇండియన్స్ కు మరో టైటిల్ దక్కింది.. ఇప్పటికే ఐపిఎల్ లో అత్యధిక టైటిల్ లను గెలుచుకున్న జట్టుగా ఉండగా... ఇప్పుడు మొదటి మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ లోనే కప్ కొట్టి తమకు సాటి లేదని నిరూపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: