
కాగా ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ సీఈవో ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్ మండలి మేనేజర్ అయిన వసీమ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలతో మళ్ళీ వివాదం చెలరేగేలా చేశాడు. పాకిస్తాన్లో ఉన్న ఒక టీవీ ఛానల్ తో వసీమ్ ఖాన్ ఇటీవల మాట్లాడాడు. ఆసియా కప్ ఆడేందుకు భారత్ పాకిస్తాన్ కు రాకుండా తటస్థ వేదికపై ఆడుతామని చెబుతుంది. ఇక తాము మాత్రం వన్డే వరల్డ్ కప్ కోసం ఇండియాకు వెళ్ళేది లేదని తాము ఆడే మ్యాచ్ లను కూడా న్యూట్రల్ వేదికలు కావాలంటూ డిమాండ్ చేశారు వసీంఖాన్. అసలు విషయం చెప్పకుండా భద్రతా లోపం అంటూ కుంటి సాకులు చెబుతుందంటూ ఇమ్రాన్ నజీర్ సైతం ఈ విషయంపై విమర్శలు గుర్తించాడు.
అయితే ఇటీవలే ఆసియా క్రికెట్ కౌన్సిల్ అటు ఆసియా కప్ నిర్వహణపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరిపింది అంటూ ఒక వార్త కూడా తెరమీదకి వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఆసియా కప్ కు సంబంధించి అన్ని మ్యాచ్లు పాకిస్తాన్లోనే జరిగినప్పటికీ భారత్ ఆడే మ్యాచ్లను మాత్రం మరొక వేదికపై నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించినట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం అటు వన్డే వరల్డ్ కప్ కోసం తటస్థ వేదిక కావాలంటూ అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేసే అవకాశం కూడా లేకపోలేదు అని చెప్పాలి.