
దీంతో ఎన్నో చెత్త రికార్డులను కూడా మూటగట్టుకున్నాడు అని చెప్పాలి. ఇక సూర్యకుమార్ ప్రదర్శన చూసిన తర్వాత అతను కేవలం టి20 ఫార్మాట్ కు మాత్రమే పరిమితం అవుతాడని ప్రేక్షకులు అందరూ కూడా భావించడం మొదలుపెట్టారు. దీంతో వన్డే వరల్డ్ కప్ లో అతనికి చోటు దక్కుతుందా లేదా అనే దానిపై కూడా చర్చ జరుగుతుంది. ఇక ఇదే విషయంపై స్పందించిన మాజీ సెలెక్టర్ శరన్ సింగ్ సూర్య కుమార్ కు మద్దతుగా నిలిచాడు. సూర్య కుమార్ అద్భుతమైన బ్యాట్స్మెన్ కానీ ఆస్ట్రేలియా తో వరుసగా 3 మ్యాచ్ లలో పరుగుల ఖాత తెరవకుండానే వెనుతిరిగాడు.
కానీ అతను తిరిగి పుంజుకొని సత్తా చాటగలడు అని నమ్మకంగా చెప్పగలను. ఆ శక్తి సామర్ధ్యాలు నైపుణ్యాలు సూర్యకుమార్ లో ఉన్నాయి. నా అభిప్రాయం ప్రకారం అయితే వరల్డ్ కప్ జట్టులో సూర్యకుమార్కు తప్పకుండా చోటు దక్కుతుంది. ఒక సెలెక్టర్ గా ఈ మాట చెబుతున్న. ఎవరైనా బ్యాట్స్మెన్ పై మనకి నమ్మకం ఉండి అతడు విఫలమైతే. వెంటనే పక్కన పెట్టాల్సిన అవసరం ఉండదు. అతడికి అండగా ఉంటూ మరిన్ని అవకాశాలు ఇస్తే దీర్ఘకాలంలో మంచి ఫలితాలు సాధించేందుకు ఛాన్స్ ఉంటుంది. నిజానికి గత ఏడాది కాలంలో సూర్య అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. తన బ్యాటింగ్కు వంక పెట్టాల్సిన అవసరం లేదు. నాకే గనక అవకాశం ఉంటే తప్పకుండా సూర్యకుమార్ను సెలెక్ట్ చేస్తా అంటూ చెప్పుకొచ్చాడు శరణ్ దీప్ సింగ్.