ఇప్పుడు వరకు ఒక బంతికి కేవలం ఒకే ఒక వికెట్ పడగొట్టడం గురించి అందరూ వినే ఉంటారు. కానీ ఒక బౌలర్ ఒకే బంతికి రెండు వికెట్లు పడగొట్టడం మాత్రం చాలా అరుదుగా క్రికెట్లో జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా జరిగిన ఒక మ్యాచ్ లో ఇలాంటి అద్భుతమే జరిగింది. ఎంతోమంది ప్లేయర్లు వికెట్లు పడగొడుతూ ఉంటే ఇక్కడ ఒక బౌలర్ మాత్రం ఒకే బంతికి రెండు వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు అని చెప్పాలి. ఇంతకీ ఆ బౌలర్ ఎవరో కాదు మనందరికీ ఫేవరెట్ అయినా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.


 రవీంద్ర జడేజా ఇప్పటికే ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమమైన ఆల్ రౌండర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు అనే విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్ లో కూడా తన స్పిన్ బౌలింగ్ తో అదరగొట్టడమే కాదు ఇక క్లిష్టమైన సమయంలో బ్యాటింగ్లో మెరుపులు మెరూపించి జట్టుకు విజయాన్ని అందించిన సందర్భాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి. అయితే ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆల్ రౌండర్ గా పేరు సంపాదించుకున్న రవీంద్ర జడేజా ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఫ్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు  అని చెప్పాలి. ఇక జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతూ ఉన్నాడు.


 ఇకపోతే ఇటీవల పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో కీలక ప్లేయర్ రవీంద్ర జడేజా ఒక ఆసక్తికర రికార్డింగ్ సృష్టించాడు అని చెప్పాలి. రవీంద్ర జడేజా బౌలింగ్లో ఓకే బంతికి రెండు వికెట్లు పడిపోయాయి. పంజాబ్ బ్యాట్స్మెన్ అధర్వ టైర్డ్ రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. అయితే క్యాచ్ పట్టీనా జడేజా..  అదే సమయంలో నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న లివింగ్ స్టోన్ ను  క్రీజు బయటికి రావడంతో బంతిని కింద వేసినట్లు చేసి వికెట్లను కొట్టాడు. ఈ చర్యతో అంపైర్ తో పాటు ఇతర ఆటగాళ్లు కూడా నవ్వుకున్నారు అని చెప్పాలి. ఈ ఘటన కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl