
ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ సాధించిన ఈ రికార్డు పై అభిమానులు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు. కోహ్లీని రికార్డులు రారాజు అని ఊరికే అనరు. ఇలాంటివి సాధిస్తాడు కాబట్టే అలాంటి బిరుదును అభిమానులు కట్టబెట్టారు అంటూ సగటు క్రికెట్ ప్రేక్షకులు కూడా కామెంట్ చేశాడు అని చెప్పాలి. అయితే ఇలా ఐపిఎల్ హిస్టరీలో 7000 పరుగులు పూర్తిచేసుకుని అరుదైన రికార్డు సృష్టించడంపై ఇటీవల విరాట్ కోహ్లీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇలా 7000 పరుగుల మైలురాయిని అందుకోవడం తనకు ఎంతో ప్రత్యేకం అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ.
అయితే ఇలా 7000 పరుగుల మైలురాయిని తన సొంత గ్రౌండ్లో సాధించడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు స్క్రీన్ పై చూశాను. ఇక ఎంతో సంతోషంగా ఉంది. ఇది నాకు ఎంతో ప్రత్యేకమైన సందర్భం. నా క్రికెట్ జర్నీ ఇక్కడే ప్రారంభమైంది. ఇక్కడే నా ఆటను చూసి సెలెక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. ఈ మైదానం పట్ల నాకు ఎంతో కృతజ్ఞత ఉంది అంటూ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా ఢిల్లీ తో జరిగిన మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగింది. కాగా అటు విరాట్ కోహ్లీ కూడా ఢిల్లీకి చెందిన ఆటగాడే కావడం గమనార్హం.