ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుతం ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు అందరూ కూడా ఐపీఎల్ లో భాగం కావడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. ఐపీఎల్ లో ఆడటం ద్వారా భారీగా ఆదాయంతో పాటు అటు ఊహించని రీతిలో పేరు ప్రఖ్యాతలు కూడా వస్తాయని బలంగా నమ్ముతూ ఉంటారు. ఈ క్రమంలోనే అటు స్థానిక క్రికెటర్ల కంటే ఎక్కువగా అటు విదేశీ క్రికెటర్లదే ఐపీఎల్లో హవా నడుస్తూ ఉంటుంది. అయితే అటు నిషేధం నేపథ్యంలో పాక్ క్రికెటర్లు మాత్రం ఐపీఎల్లో ఆడటానికి వీలు లేకుండా పోయింది అని చెప్పాలి.


 ఐపీఎల్ లో ఆడాలని ఉన్న.. నిషేధం ఉండడంతో చివరికి అవకాశాన్ని దక్కించుకోలేకపోతున్నారు పాకిస్తాన్ క్రికెటర్లు   అయితే టి20 ఫార్మాట్లో తొలిసారిగా ప్రపంచ క్రికెట్లో తొలిసారి ఈ ప్రపంచ క్రికెట్లోనీ అత్యుత్తమ ఆటగాళ్లను భారత అభిమానులు చూసారు. అది ఎప్పుడో కాదు మొదటి ఐపీఎల్ సీజన్లో. మొదటి ఐపీఎల్ సీజన్లో పాకిస్తాన్ ఆటగాళ్లు కూడా ఐపీఎల్ లో  భాగం అయ్యారు. మొత్తంగా పాకిస్తాన్ కు చెందిన 11 మంది ఆటగాళ్లకు తొలి ఐపిఎల్ సీజన్లో ఆడే ఛాన్స్ లభించింది. ఆటగాళ్లను ఏకంగా కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేశాయి ఫ్రాంచైజీలు.

ఆ వివరాలు చూసుకుంటే..
 ఐపీఎల్ తొలి సీజన్లో షాహిద్ ఆఫ్రిదిని 2.71 కోట్లతో డెక్కన్ చార్జెస్ జట్టు దక్కించుకుంది. షోయబ్ అక్తర్ ను 1.7 కోట్ల మొత్తంతో కోల్కతా నైట్ రైడర్స్ జట్టులోకి తీసుకుంది. సుహేల్ తన్వీర్ 40.16 లక్షలకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. సల్మాన్ బట్ ను 40.16 లక్షలకు కోల్కతా జట్టులో చేర్చుకుంది. మహమ్మద్ హఫీజ్ ను 40.16 లక్షలు చెల్లించి కోల్కతా తీసుకుంది. పాక్ ఫాస్ట్ బౌలర్ ఉమర్ గుల్ ను కోల్కతా 60.24 లక్షలకు జట్టులోకి తీసుకుంది. ఇక పాక్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ ను రెండు కోట్లకు ఢిల్లీ డేర్ డెవిల్స్ కొనుగోలు చేసింది. మిస్బావుల్ హక్ ను ఆర్సిబి 50.2 లక్షలకు జట్టులోకి తీసుకుంది. యూనిస్ ఖాన్ 90.36 లక్షలకు, మహమ్మద్ ఆసిఫ్ ను రెండు పాయింట్ 61 కోట్లకి ఢిల్లీ జట్టు దక్కించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl