
ఈ క్రమంలోనే 17 పాయింట్లతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లే ఆఫ్ కి అర్హత సాధించింది. ఇకపోతే చెన్నై జట్టు ప్లే ఆఫ్ కి అర్హత సాధించడంతో అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు. ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టైటిల్ ఎగరేసుకుపోతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎలా ఉంటే మ్యాచ్ ముగిసిన అనంతరం అటు రవీంద్ర జడేజా పై మహేంద్రసింగ్ ధోని సీరియస్ కావడం ఆసక్తిని కలిగించింది అని చెప్పాలి. మ్యాచ్ ముగిసిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ఒకరిని ఒకరు అభినందించుకున్న అనంతరం ఈ ఘటన జరిగింది.
ప్లేయర్స్ అందరూ కూడా డగవుట్ వైపు వెళ్తున్న సమయంలో జడేజా దగ్గరికి వచ్చిన ధోని సీరియస్ గా ఏదో అంశంపై చర్చించాడు. జడేజా కూడా అటు ధోని చెప్పింది ఎంతో సీరియస్ గా విన్నాడు. అయితే ఇక ఇటీవల ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో రవీంద్ర జడేజా బౌలింగ్ లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. బ్యాటింగ్లో ఏడు బంతుల్లో 20 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ అటు బౌలింగ్లో మాత్రం నాలుగో ఓవర్లు వేసి 50 పరుగులు సమర్పించుకున్నాడు జడేజా. ముందు ప్లే ఆఫ్ లో కీలకమైన మ్యాచులు ఉన్న నేపథ్యంలో ఇక జడేజాను ధోని హెచ్చరించినట్లు తెలుస్తోంది.