ఐపీఎల్ పోరు ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. నేడు జరగబోయే ఫైనల్ మ్యాచ్ 2023 ఐపీఎల్ సీజన్ కు తెరపడుతుంది అన్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ నిన్న జరగాల్సి ఉంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ స్టేడియంలో ఈ మ్యాచ్ నిర్వహించాలి అనుకున్నారు. కానీ వరుణ గండం కారణంగా చివరికి ఈ మ్యాచ్ నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో ఇక మ్యాచ్ రద్దు అయ్యింది అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఇక ఫైనల్ మ్యాచ్ కోసం ఏర్పాటుచేసిన రిజర్వ్ డే  అయిన నేడు ఇక ఈ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. నేడు కూడా 60% పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఏం జరుగుతుందో అనేది అందరిలో ఉత్కంఠ ఉంది. అయితే ఒకవేళ మ్యాచ్ జరిగితే మాత్రం విజేతగా ఎవరు నిలుస్తారు అనే విషయంపై కూడా ఎంతో మంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో సోషల్ మీడియాలో చెబుతున్నారు. ఈ క్రమం లోనే 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో గెలిచే టీం ఏది అన్న విషయంపై ఆస్ట్రేలియా మాజీ, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ షేన్ వాట్సన్ స్పందిస్తూ జోష్యం చెప్పాడు.


 ఎన్ని రోజులకు అందరూ ఎంతగానో ఎదురు చూసిన రోజు రానే వచ్చేస్తుంది. ఈరోజు జరిగే ఫైనల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ టీం 100% గెలుస్తుందని నా మనసు చెబుతుంది గెలుస్తుంది. కానీ గుజరాత్ టైటాన్స్ గెలుస్తుందని  మాత్రం నా మైండ్ చెబుతుంది. కానీ చెన్నై సూపర్ కింగ్స్ గెలవాలని నేను బలంగా కోరుకుంటున్నాను. ఈరోజు ఫైనల్ గెలిచి ఐదవ ట్రోఫీని కూడా సొంతం చేసుకోవాలని నేను బలంగా ప్రార్థిస్తున్నాను అంటూ షేన్ వాట్సన్ చెప్పుకొచ్చాడు. కాగా షేన్ వాట్సన్ గతంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున పలు సీజన్లకు ప్రాతినిధ్యం వహిస్తు.. తన అద్భుతమైన ఆటతీరుతో అభిమానులను సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl