ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో తమ ఆటతీరుతో ఆకట్టుకుని ఎన్నో ఏళ్ల పాటు దేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన స్టార్ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా క్రికెట్కు దగ్గరగా ఉండడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కొంతమంది కోచుల అవతారం ఎత్తితే.. మరి కొంతమంది వ్యాఖ్యాతగా మారి ఇక క్రికెట్ మ్యాచ్ కి తమ గొంతును జోడిస్తూ మ్యాచ్ ని మరింత ఉత్కంఠ భరితంగా మారుస్తూ ఉంటారు. అయితే కేవలం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్లు మాత్రమే కాదు సీనియర్ క్రికెటర్లుగా ముద్ర పడి ఇక జట్టులో స్థానం కోల్పోయినవారు సైతం ఇలా వ్యాఖ్యాతగా మారిపోతూ ఉంటారు అని చెప్పాలి. ఇలా భారత క్రికెట్లో చాలామంది క్రికెటర్లు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించకపోయినప్పటికీ వ్యాఖ్యాతగా మారిన వారు ఉన్నారు. ఇలా భారత క్రికెట్లో సీనియర్ క్రికెటర్ అనే ముద్ర పడి ఇక జట్టుకు దూరమై వ్యాఖ్యాతగా మారిన వారిలో సీనియర్ బ్యాట్స్మెన్ దినేష్ కార్తీక్ కూడా ఒకరు అని చెప్పాలి. కొన్నేళ్ల నుంచి వ్యాఖ్యాతగా దినేష్ కార్తీక్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. అయితే గత ఏడాది ఐపీఎల్ లో మాత్రం తన అద్భుతమైన ప్రదర్శనతో మళ్ళీ టీమ్ ఇండియాలోకి వచ్చాడు. కానీ ఫామ్ కోల్పోయి మళ్ళీ ఇబ్బంది పడటంతో ఇక జట్టులో స్థానం కోల్పోయాం.


 అయితే ఇక ఇప్పుడు డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ కోసం సిద్ధమవుతున్నాడు దినేష్ కార్తీక్. అదేంటి డబ్ల్యూటీసి ఫైనల్ లో అతను సెలెక్ట్ కాలేదు కదా మరి దాని కోసం ఎందుకు సిద్ధమవుతున్నాడు అని అనుకుంటున్నారు కదా.. అయితే ప్లేయర్ గా కాదు వ్యాఖ్యాతగా మ్యాచ్ ను మరింత  ఉత్కంఠ గా మార్చేందుకు సిద్ధమవుతున్నాడు దినేష్ కార్తీక్   రికీ పాంటింగ్, హెడేన్, లాంగర్, గవాస్కర్, రవి శాస్త్రి, సంగకర లాంటి దిగ్గజాలతో పాటు ఇక కామెంట్రీ చేయబోతున్నాడు అని చెప్పాలి. కాగా డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ జూన్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: