
ఐపీఎల్ ద్వారా దొరికిన ఆకాశాన్ని ఎంతో అద్భుతంగా సద్వినియోగం చేసుకుని ఇక టీమ్ ఇండియాకు ఫ్యూచర్ ఫినిషర్ తానే అనే నమ్మకాన్ని ఎంతో మందిలో కలిగించాడు అని చెప్పాలి. అయితే గుజరాత్ తో మ్యాచ్ తర్వాత రింకు సింగ్ పాపులారిటీ ఆకాశాన్నింటింది అనడంలో సందేహం లేదు. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఎప్పుడు మ్యాచ్ ఆడుతున్న ప్రేక్షకులు మొత్తం స్టేడియం దద్దరిల్లిపోయేలా రింకు సింగ్ పేరును నినదించడం మొదలుపెట్టారు అని చెప్పాలి. అయితే కేవలం గుజరాత్ తో మ్యాచ్లో మాత్రమే కాదు మరిన్ని మ్యాచ్ లలో కూడా తన ఫినిషింగ్ తో అదరగొట్టాడు. ఈ క్రమంలోనే ఇతను బ్యాటింగ్ గురించి ఇటీవల మాట్లాడిన రింకు సింగ్.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని తనకు విలువైన సలహాలు ఇచ్చాడు అని చెప్పుకొచ్చాడు.
చపాక్ వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నై పై కోల్కతా విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కూడా రింకు సింగ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే రింకు సింగ్ మాట్లాడుతూ మహిభాయ్ ఒక బెస్ట్ ఫినిషర్.. అందుకే మ్యాచ్ ఎలా ఫినిష్ చేయాలని తనను అడిగాను. అప్పుడు ధోని నన్ను మెచ్చుకున్నాడు. నా బ్యాటింగ్ చూసానని చాలా బాగా ఆడుతున్నావు అంటూ అన్నాడు. అయితే చివరి ఓవర్లో ఆడేటప్పుడు బౌలర్ ఏం చేయాలనుకుంటే అది చేయనివ్వు.. నువ్వు మాత్రం స్ట్రెయిట్ గా కొట్టడానికి ట్రై చెయ్ అని ధోని సలహా ఇచ్చాడు అంటూ రింకు సింగ్ చెప్పుకొచ్చాడు. ఇక ధోని ఇచ్చిన సలహా తనకు ఎంతగానో ఉపయోగపడింది అంటూ చెప్పుకొచ్చాడు.