
అయితే క్రికెటర్లలో ఇలా ఎవరైనా వేల కోట్లు సంపాదించారు అంటే ఇక వారిని అత్యంత సంపన్నులుగా పరిగణిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక భారత మాజీ క్రికెటర్ మాత్రం 4.95 లక్షల కోట్ల సామ్రాజ్యానికి వారసుడు అన్న వార్త మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆయన ఎవరో కాదు ఆర్య మాన్ బిర్లా. 60 బిలియన్ డాలర్లు అంటే నాలుగు లక్షల 95 వేల కోట్ల నికర విలువతో ఆదిత్య బిర్లా గ్రూప్ ఎన్నో రంగాలలో దూసుకుపోతుంది. గత రెండు సంవత్సరాల్లో పెయింట్స్, బి టు బి, ఈ కామర్స్ బిజినెస్ తో పాటు మూడు పెద్ద వ్యాపారాల్లోకి కూడా ప్రవేశించింది.
ఇక ఇప్పుడు ఆదిత్య బిర్లా గ్రూప్ నావెల్ జూవెల్స్ లిమిటెడ్ పేరుతో బ్రాండెడ్ జువెలరీ బిజినెస్ లోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. బడా బాబులే లక్ష్యంగా హై క్వాలిటీ జువెలరీ రంగంలోకీ 5000 కోట్ల పెట్టుబడితో రంగంలోకి దిగిపోతుంది అని చెప్పాలి. ఇలా ఆభరణాల బిజినెస్ లో టాటా గ్రూప్ తనిష్ ఇటు రిలయన్స్ కు కూడా ప్రధాన ప్రత్యర్థిగా పోటీ పడబోతుంది అని చెప్పాలి. అయితే గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా కుమారుడే ఆర్య మాన్ బిర్లా. 25 ఏళ్ళ ఆర్య మాన్ బిర్లా ప్రస్తుతం ఎన్నో బిజినెస్ లలో కొనసాగుతున్నారు. అయితే ఒకప్పుడు దేశీయ క్రికెటర్ గా ఆకట్టుకున్నాడు ఆర్యమాన బిర్లా. 2017- 18 రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్లో ఫస్ట్ క్లాస్ చేశాడు. 2018 ఐపిఎల్ వేలంలో అతని రాజస్థాన్ కొనుగోలు చేసింది. అక్కడ తన తొలి హాఫ్ సెంచరీ చేసి వార్తల్లో నిలిచాడు. అయితే అతనికి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం.. ఆల్రౌండర్ గా టీమిండియా తరఫున రాణించాలనుకున్నాడు. కానీ ఆందోళన, ఇతర ఆరోగ్య కారణాల వల్ల క్రికెట్ నుంచితప్పుకున్నాడు ఆర్య మాన్ బిర్లా.
