ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఎక్కడ చూసినా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ గురించి చర్చ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే 2021లో డబ్ల్యూటీసీ ఫైనల్ లో కి వచ్చిన టీమిండియా.. న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది అన్న విషయం తెలిసిందే. మధ్యలో వర్షం అంతరాయం కలిగించడంతో ఇక ఆ తర్వాత కాసేపటికి మ్యాచ్ ప్రారంభమైంది. వర్షం కారణంగా ఇక పిచ్ బౌలింగ్ కి అనుకూలంగా మారింది. ఈ క్రమంలోనే రవీంద్ర జడేజా అశ్విన్లతో బలిలోకి దిగింది టీమిండియా. కానీ ఇద్దరు స్పిన్నర్ లు విఫలం కావడంతో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు చెలరేగిపోయారు అని చెప్పాలి.


 దీంతో పరిస్థితులు అనుకూలించక 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయింది టీమిండియ. అయితే ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఆడబోతుంది. అయితే అక్కడ పిచ్ లు ఫేస్ కి ఎక్కువగా అనుకూలిస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీమిండియా తుదిజట్టు కూర్పు ఎలా ఉంటుంది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఇటీవల ఇదే విషయంపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నజీర్ హుస్సేన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాను వారి దేశంలోనే ఓడించిన భారత్ ఎలాంటి పిచ్లపైన అయినా గెలవ గలదు అంటూ వ్యాఖ్యానించాడు. ఒకవేళ వాతావరణం బాగుండి.. ఎండ ఎక్కువగా ఉంటే తన రెగ్యులర్ ఫార్ములా తోనే టీమ్ ఇండియా బరిలోకి దిగుతుంది. ఇద్దరు స్పిన్నర్లు ఇద్దరు సీమర్లతో పాటు మూడో పేసర్ గా శార్దూల్ ఠాగూర్ ని జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఎండ ఉంటే పిచ్ స్పిన్ కి ఫేస్ కి సమానంగా అనుకూలిస్తుంది. అయితే గత డబ్ల్యుటిసి ఫైనల్ మ్యాచ్ ఓసారి గుర్తు చేసుకుంటే.. అప్పటి పిచ్ పరిస్థితులను టీమిండియా తప్పుగా అర్థం చేసుకున్నట్లు అనిపించింది. ఐదు రోజులు లైట్లు ఆన్ లోనే ఉన్నాయి. తేమ వాతావరణం ఉంది. అందుకే కివీస్ ప్రధాన స్పిన్నర్ తో బరిలోకి దిగలేదు. అయితే భారత్ మాత్రం ఇద్దరు స్పిన్నర్లతో ఆడింది. అయితే ఈసారి మాత్రం పిచ్ ఎలా ఉన్నా పరిస్థితులను అర్థం చేసుకొని టీమిండియా బరిలోకి దిగితే బాగుంటుంది అంటూ హెచ్చరించాడు నాసిర్ హుస్సేన్.

మరింత సమాచారం తెలుసుకోండి: