ఇక ఓవల్‌ వేదికగా జరుగుతున్న వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్లో ఆస్ట్రేలియా టీం పట్టు బిగించింది. రెండో రోజు ఆట ప్రారంభం అవ్వగానే స్టీవ్‌ స్మిత్‌ సెంచరీ పూర్తి చేశాడు.ఇంగ్లండ్‌ లో స్మిత్‌కు ఇది 7వ సెంచరీ.ఆస్ట్రేలియా తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల లిస్టులో 3వ స్థానంలో వున్నాడు. ఇక రికీ పాంటింగ్‌ (41), స్టీవ్‌ వా (32) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.అలాగే టీమిండియాపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో జో రూట్‌తో పాటు అగ్రస్థానంలో వున్నాడు. రూట్‌, స్మిత్‌లు ఇద్దరు టీమిండియాపై ఏకంగా 9 శతకాలు బాదారు.ఇక పర్యాటక జట్టు తరఫున ఇంగ్లండ్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల లిస్టులో స్టీవ్‌ వాతో పాటు రెండో స్థానంలో వున్నాడు. స్టీవ్‌ వా, స్మిత్‌లు ఇద్దరు చెరో 7 సెంచరీలు చేయగా.. ఇక టాప్‌లో సర్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ (11) ఉన్నారు.అలాగే పర్యాటక జట్టు తరఫున ఇంగ్లండ్‌లోని ఓ వేదికపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల లిస్టులో ఆరో స్థానంలో వున్నాడు. 


స్టీవ్‌ స్మిత్‌ ఓవల్‌ మైదానంలో మొత్తం 3 సెంచరీలు చేశాడు. డాన్‌ బ్రాడ్‌మన్‌ హెడింగ్లేలో అత్యధికంగా 4 సెంచరీలు ఇంకా ట్రెంట్‌బ్రిడ్జ్‌లో 3 సెంచరీలు చేశాడు. ఇండియా తరఫున దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ లార్డ్స్‌లో 3 సెంచరీలు చేశాడు.భారత్‌-ఆస్ట్రేలియా టీమ్స్ మధ్యలో టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల లిస్టులో రెండో స్థానంలో (9) వున్నాడు. ఈ లిస్టులో సచిన్‌ (11) టాప్‌లో ఉన్నాడు.ఇక ఐసీసీ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో కనీసం 2 సెంచరీలు చేసిన ఏడో ఆటగాడుగా నిలిచాడు.గంగూలీ (3), పాంటింగ్‌ (3), సయీద్‌ అన్వర్‌ (3), జయవర్దనే (2), రోహిత్‌ శర్మ (2) ఇంకా వాట్సన్‌ (2) స్టీవ్‌ స్మిత్‌ కంటే ముందున్నారు.టీమిండియాకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు స్మిత్‌.టెస్టుల్లో టీమిండియాపై మంచి రికార్డు కలిగిన స్టీవ్ స్మిత్‌.. ఈసారి ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్లో సెంచరీ మార్క్‌ ని అందుకున్నాడు. మొత్తం 229 బంతుల్లో 17 ఫోర్ల సాయంతో సెంచరీ మార్క్‌ అందుకున్న స్మిత్‌కు టెస్టుల్లో ఇది 31వ సెంచరీ కాగా టీమిండియాపై తొమ్మిదవది.


మరింత సమాచారం తెలుసుకోండి:

WTC