తిమ్మిని బమ్మి చేయడం... ఏమి లేకపోయినా ఏదో బ్రహ్మాండం జరిగిపోతుంది అన్నట్టుగా బ్రమలు కల్పించి ఎప్పుడూ మీడియా ఫోకస్ తమపైనే ఉండేలా చూసుకోవడం లో సెంద్రబాబు ను మించిన నాయకుడు మరొకరు ఉండరు.ఇప్పుడు సైకిల్ పార్టీ పడని కష్టం అంటూ లేదు. ఏదో రకంగా పార్టీని ఒక్కో ఒడ్డుకు చేర్చి విశ్రాంతి తీసుకోవాలని సైకిల్ పార్టీ అధినేత సెంద్ర బాబు భావిస్తున్నారు. దీనిలో భాగంగానే ఇటీవల పెద్ద ఎత్తున రాష్ట్ర, జాతీయ కమిటీలను ఏర్పాటు చేసి ,పార్టీలో ఉత్సాహం పెరిగే విధంగా ప్రయత్నించారు. అలాగే తన రాజకీయ వారసుడు చినబాబు కు ఎటువంటి ఇబ్బంది లేకుండా ,ఆయన ప్రాధాన్యం పెంచే విధంగా , ఆయనకు అనుకూలంగా ఉండే నాయకులకు ఎక్కువగా కమిటీలో ప్రాధాన్యం కల్పించారు. అయినా ఎక్కడా నాయకుల్లో ఉత్సాహం వచ్చినట్టుగా కనిపించడం లేదు. 




అసలు ముందుగా చిన బాబు లో ఉత్సాహం కనిపించకపోవడంతో, పార్టీలో చర్చ జరుగుతోంది. చినబాబు ఎక్కువగా హైదరాబాద్ కే పరిమితం అయిపోవడం, అప్పుడప్పుడు చుట్టపుచూపుగా వచ్చినట్లుగా ఏపీలో అడుగు పెడుతూ, వైసీపీ ప్రభుత్వం పై తిట్లదండకం అందుకుని, ఆ తర్వాత హైదరాబాద్ కు వెళ్ళిపోతున్నారు. కానీ రాజకీయ విమర్శలు రాకుండా సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే 70 ఏళ్ల వయసు లో సెంద్రబాబు మాత్రం ఇంకా పార్టీని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్ తో పోటీ పడుతూ, పార్టీని పరుగులు పెట్టించేందుకే 
సెంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కానీ  చినబాబు 
మరింత యాక్టివ్ చేసే విషయంలో సక్సెస్ కాలేకపోవడం, సెంద్రబాబు కు ఇబ్బందికరంగా మారింది. 




చినబాబు రానున్న రోజుల్లో పార్టీ పగ్గాలు చేపట్ట బోతున్నారు అనే విషయాన్ని పార్టీ శ్రేణులు సైతం జీర్ణించుకోలేకపోతున్నాయి.  ఏదో రకంగా పార్టీని నెట్టుకొచ్చినా, చినబాబు పార్టీని ముందుకు నడిపించే అంతటి శక్తి సామర్ధ్యాలు లేవని, అసలు ఆయన మాట వినే పరిస్థితి పార్టీ లో లేదు అనే విషయాన్ని పార్టీ నేతలే ఒకరికొకరు చర్చించుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రభుత్వంపై  చినబాబు  విమర్శలు చేస్తున్నా , ప్రత్యక్షంగా వచ్చేసరికి ఆయన ప్రసంగాల్లో అంత స్పీడ్ లేకపోవడం,  ఇబ్బందికరంగా మారాయి. ఇటీవల చంద్రబాబు అంతర్గతంగా పార్టీలు పరిణామాలపై చేయించిన సర్వేల్లో ను ఇదే  రకమైన రిపోర్ట్ రావడంతో మరిన్ని ఎత్తుగడలు వేసే ఈ విషయంపై బాబు దృష్టి పెట్టేశారట. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ కు లోకేష్ సమవుజ్జీ కాదు అనే విషయాన్ని టీడీపీ శ్రేణులు ఒప్పుకుంటూ ఉండడంతో , ఆయన రాజకీయ భవిష్యత్తు పై అందరిలోనూ గందరగోళం నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: