ఉదయాన్నే లేవగానే చాలా మంది చేసే మొదటి పని అద్దంలో ముఖాన్ని చూసుకోవడం. ఇప్పుడైతే లేవకముందే మొబైల్ ఫోన్ ను చూడటం ఎక్కువ మంది చేస్తున్నారు. అయితే ఈ అలవాటుకు ఎంత దూరముంటే అంత మంచిది. ఎందుకంటే ఇలా చేసినప్పుడు ప్రతికూల శక్తి మనల్ని తన నియంత్రణలో పెట్టుకుంటుంది. ఇందుకు బదులు ఉదయాన్నే లేచి ముఖాన్ని పరిశుభ్రంగా కడుక్కొని ఇంట్లో ఉన్న భగవంతుడి రూపాన్ని సందర్శించాలి. అనంతరం మీ పనులు మీరు చేసుకోవచ్చు.