గర్భగుడిలో కొలువైన దైవానికే కాదు ... ఇంట్లోని పూజా మందిరంలో నెలవైన దైవానికి కూడా నైవేద్యం పెట్టవలసిందే. చేసేది నిత్యపూజ అయినా విశేష పుణ్యతిథుల్లో చేసే ప్రత్యేక పూజే అయినా నైవేద్యం తప్పనిసరిగా సమర్పించవలసిందే. దైవానికి ఎలాంటి లోటూ జరగకూడదనే ఉద్దేశంతో, వివిధ రకాల నైవేద్యాలను తయారు చేస్తారు.