-వాగర్ధా వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే,

జగతః పితరౌ వందే, వందే పార్వతీ పరమేశ్వరౌ-

 

సృష్టిలో మొదట పుట్టింది నీరు.  నారా అంటే నీరని అర్థం.  నీటినుండి పుట్టినవాడే నారాయణుడు. సృష్టిలోని తొలి దంపతులు పార్వతీ పరమేశ్వరులు. సృష్టికే తొలి ప్రకృతి - స్త్రీమూర్తి శక్తి (పార్వతి) కి మరో పేరు గౌరి. అందువలననే హిందూ వివాహాల కార్యక్రమం లో గౌరీ పూజ చేయించే ఆచారముంది. లక్ష్మి పూజ కాని, సరస్వతి పూజగాని చేయించరు. సృష్టికి తొలి పెళ్ళికూతురు గౌరిదేవి మాత్రమే.


 

శివాలయాల్లో శివుడు లింగాకారం లో ఉంటాడు. లింగ అకారానికి క్రిందిభాగములో ఆవృతమై ఉండే పానవట్టమే పార్వతి. శివపార్వతుల ఏకత్వ రూపమే శివలింగం. శివుడు లేక పార్వతి లేదా ఈశ్వరి, ఈశ్వరి లేకుండా శివుడు ఉండరు, ఉండలేరు. అసలు శివలింగమే సృష్టి స్వరూపం. స్త్రీ పురుషుల సంగమాన్నే శృంగారం అంటారు. శివలింగాన్ని పూజిస్తే ఈశ్వరి ఈశ్వరులను, లేదా పార్వతి పర మేశ్వరులను, సృష్టిని, సృష్టి కార్యాన్ని అంటే ప్రకృతి - పురుషులను శృంగారాన్ని పూజించినట్లే. 



 

ఆందుకే పార్వతికి ఒక ఆలయం, పరమేశ్వరునికి ఒక ఆలయం వేరు వేరుగా నిర్మించరు. ఆన్యోన్య దాంపత్యానికి, అనురాగజీవితానికి, శాశ్వతబంధాన్ని కోరుకునే వారు శివాలయంలో శివపార్వతులను పూజిస్తారు. శివుడు తన భార్య అయిన పార్వతికి  తనదేహంలో అర్ధభాగమిచ్చి ఆర్ధనారీశ్వరుడయ్యాడు.



 మనిషికి వార్ధక్యములో లక్ష్మి, సరస్వతులతో పనిలేదు. అంటే డబ్బు, చదువు తో అవసరం తక్కువ. పనంతా శక్తి తోనే కదా! పార్వతి  శక్తి ప్రదాత కదా! అందుకే ప్రార్ధనలు అన్నీ పార్వతి కే. దేహం శుష్కించి నరాలు బలహీనమై లేవలేని మనిషికి కావలసింది శక్తి. ఆ  తరవాత మోక్ష మిచ్చే దేవత కూడా మహాశక్తియే. ఆ సామర్ధ్యం పార్వతికే ఉంది. సృష్టికి లాగే లయత్వానికి కూడా శివపార్వతులే కర్తలు. వారి చేసే కర్మే శృంగారం. దాని ప్రతీకే బిడ్డలు. వీరి పుట్టుకకై చేసే శృంగారానికి దైవత్వముంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: