భారతదేశంలో గత మూడు నెలల నుంచి లాక్ డౌన్ పొడిగిస్తునే వస్తుంది మన కేంద్ర ప్రభుత్వం. అప్పటి నుంచి అనేక పరిశ్రమలు వివిధ రంగాలకు సంబంధించిన షాపింగ్ మాల్స్, దేవాలయాలు, మసీదులు, ప్రార్థన మందిరాలు... ప్రతిదీ లాక్ డౌన్ కారణంగా మూసివేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇకపోతే తాజాగా కేంద్ర ప్రభుత్వం జూన్ 8 నుంచి అనగా రేపటి నుంచి దేవాలయాలను తెరుచుకొని భక్తులను వాటిలోకి ప్రవేశం కల్పించేలా నిర్ణయం తీసుకున్న సంగతి అందరికీ తెలిసినదే. 

IHG


ఇక ఇదే నేపథ్యంలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి దేవాలయం రేపటి నుంచి భక్తులతో పూర్వవైభవం సంపాదించ లేక పోయినా భక్తులతో కనబడుతుంది. అంతేకాకుండా దూరప్రాంతాల నుంచి దేవాది దేవుడు కొలువై ఉన్న తిరుమలకు భక్తులు తొందరపడి రావద్దని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలియజేశారు. అందుకోసం కేవలం ఆన్ లైన్ ద్వారా ముందే టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన మీడియాకు వెల్లడించారు. ఇకపోతే అలిపిరి గేట్ వద్దనే థర్మల్‌ స్క్రీనింగ్‌, శానిటేషన్, వాహనాల తనిఖీలు అనంతరం కేవలం దర్శన టికెట్లు ఉన్నవారికి మాత్రమే తిరుమలకు ఇవ్వడానికి అనుమతిస్తారని ఆయన తెలిపారు.

IHG

అంతేకాదు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల మేరకు ఇటు 10 సంవత్సరాలలోపు ఉన్న చిన్న పిల్లలను 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులను ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించడం లేదని ఆయన తెలియజేశారు. కాబట్టి భక్తులు ఎవరైనా సరే కేవలం దర్శన టికెట్లు కలిగిన వారైతే మాత్రమే తిరుమలకు వెళ్ళండి లేకపోతే మీ ప్రయాణాన్ని మానుకోండి. అది మీకు మాత్రమేకాకూండా ప్రజలందరికీ సురక్షితం.

మరింత సమాచారం తెలుసుకోండి: