మనం నిత్యం పూజలు చేస్తుంటాం. అయితే పూజ చేసే సమయంలో చివరగా కర్పూరం వెలిగించి దేవునికి హారతి ఇచ్చి ప్రార్థించి పూజను పూర్తి చేస్తాము. కర్పూరంతో హారతి ఇస్తేనే కానీ  పూజ పూర్తి అయిన భావన రాదు. కర్పూరం అనేక ఆధ్యాత్మిక  ప్రయోజనాలను  కలిగి ఉంటుంది. ఎంతో పవిత్రమైనది. ఇది మన కుటుంబంలో ఎదురయ్యే  అన్ని ప్రతికూల పరిస్థితులను అడ్డుకుని మనకు ప్రశాంతమైన  జీవితాన్ని అందిస్తుందని  పండితులు చెబుతున్నారు.  అంతే కాదు కర్పూరం యొక్క వాసన పరిసరాలను శుభ్రపరచి వాతావరణాన్ని కమ్మటి సువాసనతో నింపేస్తుంది. కర్పూరం నుండి వెలువడే పొగ దుష్ట శక్తులను మన ముందుకు, మన ఇంటి ఆవరణలోనికి రాకుండా దైవ శక్తిని కలిగి అడ్డుకుంటుంది. 

వాటి ప్రతికూల శక్తులను మటు మాయం చేస్తుంది. అందుకే ఇంట్లో పూజ చేసేటప్పుడు మాత్రమే కాదు, ఎవరికైనా దిష్టి తీసేందుకు కూడా కర్పూరాన్ని వెలిగించి దిష్టి తీస్తుంటారు. తద్వారా ఆ వ్యక్తిపై ఉన్న ప్రతికూల శక్తులను సంగ్రహిస్తుందని ఒక విశ్వాసం. కర్పూరం వెలిగించడం వలన వచ్చే వెలుగులు మన జీవితంలో రాబోయే  దివ్య కాంతులకు ప్రతీక అని చెబుతుంటారు. పూజ సమయంలో నిత్యం కర్పూరం వెలిగించే ఇల్లు సిరి సంపదలతో తుల తూగుతుంది. ఇలా కర్పూరం వలన  ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. 

అంతే కాక పూజా విధానాల్లో వాడే కర్పూరం వల్ల ఎన్నో హెల్త్ అండ్ బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చిన్న పిల్లలకు జలుబు , దగ్గు ఎక్కువైనప్పుడు వెచ్చటి కొబ్బరి నూనెలో కర్పూరం కరిగించి ఆ నూనెను వారి వీపు వెనుక భాగంలో రాస్తే ఉపశమనం కలుగుతుంది. ఇలా కర్పూరం వలన  ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి కర్పూరాన్ని కేవలం పూజ లోనే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడే ఔషధంగా కూడా ఉపయోగించుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: