మనలో చాలామంది మంగళవారం వచ్చిందంటే చాలు హనుమంతుడని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు.  హనుమంతుడికి సింధూరంతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుస్తారు అని అనుకుంటూ ఉంటారు.  చాలామంది మంగళవారం ఆంజనేయస్వామిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు . కొందరు తమలపాకులతో.. కొందరు సింధూరంతో.. కొందరు వడమాలతో రకరకాలుగా పూజిస్తారు . అసలు ఎందుకు మంగళవారం నాడే ఆంజనేయ స్వామిని పూజిస్తారు ..? మిగతా రోజుల్లో ఎందుకు పెద్దగా పట్టించుకోరు ..? ఎందుకు మంగళవారం ప్రత్యేకంగా పూజిస్తారు ..? అనే విషయాలు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!


సనాతన ధర్మంలో రామ భక్త హనుమాన్ కి ప్రత్యేక స్థానం ఉంది అన్న విషయం అందరికీ తెలిసిందే.  హనుమంతుడిని ఆరాధిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయని కోరుకున్న కోరికలు నెరవేరుస్తాడు అని.. భక్తుల అపారమైన నమ్మకం . అలా జరిగిన ఎన్నో ఇన్సిడెంట్స్ ని ఎగ్జాంపుల్స్ గా చెప్తూ ఉంటారు . ప్రతి యుగంలోనూ పిలిచిన వెంటనే తన భక్తులకు సహాయం చేయడానికి వాయువేగంతో వస్తాడు ఆంజనేయ స్వామి అని పురాణాలు చెబుతున్నాయి.  హనుమంతుడిని పూజించడానికి మంగళవారం ఎందుకు ఉత్తమమైన రోజుగా పరిగణిస్తారు అంటే.." కేసరి , అంజన దంపతుల కుమారుడైన హనుమాన్ చైత్రమాసం మొదటిరోజున జన్మించాడు".



ఆరోజు మంగళవారం ఆ విధంగా భక్తులు మంగళవారం ఆంజనేయస్వామికి పూజ జరుపుకుంటారు . అంతేకాదు మంగళవారం నాడు పవనపుత్రుడిని పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని కూడా నమ్ముతూ ఉంటారు . అంతేకాదు రామాయణానికి మంగళవారానికి కూడా ఒక అనుబంధం ఉంది అని పురాణాలు చెబుతున్నాయి . సీతాదేవిని రావణాసురుడు అపహరించే లంకలో దాయగా.. వాయు పుత్రుడు ఆమె జాడ కోసం వెతికి లంకలో ఉన్నట్లు గుర్తించిన రోజు కూడా మంగళవారం అని పండితులు చెబుతూ ఉంటారు.  ఈ కీలక సందర్భం హనుమాన్ దృఢమైన నిబద్ధత విరోచిత ధైర్యాన్ని ప్రదర్శిస్తుంది అని కూడా చెబుతూ ఉంటారు . ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మంగళవారంనాడు భక్తులు హనుమాన్ దేవాలయాలను సందర్శిస్తే ఇంకా మంచి జరుగుతుంది అని రామాయణాన్ని పారాయణం చేస్తూ ఉంటారు కొంతమంది భక్తులు. ఆ విధంగా మంగళవారం అంటే ఆంజనేయస్వామికి చాలా చాలా ప్రీతికరమైన రోజుగా పండితులు చెబుతున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: