భారతదేశం అంటేనే ఎంతో భక్తి భావానికి పుట్టినిల్లు. ఇక్కడ ఏ పని చేసినా తప్పకుండా ముహూర్తం జ్యోతిష్య శాస్త్రం ప్రకారమే చేస్తారు. చాలామంది ప్రజలు జ్యోతిష్య, వాస్తు శాస్త్రాన్ని నమ్ముతారు. అయితే ఒక్కోసారి కొంతమంది ఎంత సంపాదించినా కానీ ఇంట్లో సంపాదన నిలవదు. దీనికి కారణం కూడా వాస్తు దోషాలే అయి ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లో,ఆఫీసుల్లో,వ్యాపార సముదాయాల్లో ఉత్తమ ఫలితాలు వచ్చినా రూపాయి మిగలకపోతే అది తప్పకుండా వాస్తు దోషమే అయి ఉంటుంది. మరి ఈ శాస్త్రం ప్రకారం  ఆర్థికంగా బలపడాలంటే ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.. కొంతమంది వ్యక్తులు ఎంత సంపాదించినా, డబ్బులు మాత్రం పొదుపు చేయలేకపోతుంటారు. దీనికి కారణం కూడా వాస్తు దోషమే అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు  తెలియజేస్తున్నారు. 

వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి ఇంటిలో ఆర్థిక సంపద పెరగాలి అంటే.. ఇంట్లో డబ్బు, ఆభరణాలను ఎప్పుడైనా సరే ఉత్తర దిశలో పెట్టుకోవాలి.. దీనివల్ల డబ్బు, ఆభరణాలు ఎక్కువ కాలం నిలువ ఉండి మీకు సంపద పెరుగుతుందని తెలియజేస్తున్నారు.. ఇవే కాకుండా వెండి నాణాలు లేదంటే శ్రీ యంత్రాన్ని  మీ యొక్క బీరువాలకు పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుందట.. ముఖ్యంగా ఉత్తర దిశకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ దిశను కుబేరుడి దిశ అని కూడా అంటారు. అందుకే ఈ దిశలో మన సంపదకు సంబంధించిన వాటిని పెట్టుకుంటే అంతా శుభప్రదమే అని నిపుణులు తెలియజేస్తున్నారు.

అంతేకాకుండా ఉత్తర దిశలో కుబేరుడి విగ్రహం లేదంటే చిత్రపటాన్ని ఉంచడం చాలా మంచిదట. అలాగే ఈ దిశను చాలా శుభ్రంగా ఉంచుకుంటూ ముందుకు వెళ్లాలి. ఇక ఇదే కాకుండా ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు  ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే  అంతా మంచి జరుగుతుంది. ముఖ్యంగా అమ్మవారికి కమలం పూలు సమర్పిస్తూ పూజలు చేయాలట. లక్ష్మీదేవికి పూజ చేసే సమయంలో తలంటు స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని నిష్టతో పూజ చేస్తే మీకు అనుగ్రహం కలిగి సంపద పెరుగుతుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: