భారత మాజీ ఆల్రౌండర్ అయినా యువరాజ్  కి భారత క్రికెట్ లో మంచి గుర్తింపు ఉంది అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ప్రస్తుతం భారత జట్టులో ఆడుతున్న ఆటగాళ్లతో మంచి స్నేహపూర్వక బంధం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అప్పుడప్పుడు భారత ఆటగాళ్లతో ఆన్లైన్ చాట్ చేస్తూ ముచ్చటిస్తూ ఉంటారు భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్. అయితే కొన్ని కొన్ని సార్లు క్రికెటర్లు చేసే చిలిపి వ్యాఖ్యలు కాస్త వారికి కొత్త తలనొప్పులు తెచ్చి పెడతాయి అన్న విషయం తెలిసిందే. ఇక తాజాగా భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. యువరాజ్ సింగ్ కి  కొత్త తలనొప్పి ఎదురైంది. తాజాగా టీమిండియా యువ స్పిన్నర్ అయినా యజ్వేంద్ర చాహల్ గురుంచి  సరదాగా మాట్లాడిన మాట్లాడగ... ఇదే క్రమంలో పొరపాటుగా కులం పేరు వాడటం కాస్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 

 

 కొన్ని రోజుల క్రితం టీమిండియా వైస్ కెప్టెన్ అయినా రోహిత్ శర్మతో ఇంస్టాగ్రామ్ లైవ్ లో మాట్లాడిన యువరాజ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. నిజానికి ఈ వీడియో పాతదే అయినప్పటికీ ప్రస్తుతం మాత్రం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. టిక్ టాక్ లో చాహల్  తన కుటుంబ సభ్యులతో కలిసి వీడియోలు చేస్తున్నాడని... వీళ్ళకి ఏం పనిలేదు అంటూ వాల్మీకి సమాజానికి కించపరిచేలా యువరాజ్ సింగ్ పలు వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో అంత గొప్ప క్రికెటర్ అయ్యుండి కులాన్ని కించపరిచేలా విమర్శలు ఎలా చేస్తారు అంటూ ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

 

 

 ఒక కులాన్ని వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు అని నెటిజన్లు ప్రస్తుతం యువరాజ్  పై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ కి సరికొత్త తల నొప్పి మొదలైంది. వెంటనే యువరాజ్ సింగ్ బేషరతుగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు  చేప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలోనే యువరాజ్ సింగ్ మాఫీ మాంగో అని హ్యాష్ ట్యాగ్  ప్రస్తుతం సోషల్ మీడియాలో  ట్రెండింగ్  గా మారిపోయింది. అయితే ఇలా యువరాజ్ సింగ్ సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కోవడానికి ఇదే తొలిసారి కాదు. గతంలో పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది ఫౌండేషన్ కి మద్దతు ప్రకటించినప్పుడు కూడా దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మరి యువి దీనిపై ఎలా స్పందిస్తాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: