తక్కువ సమయంలోనే భారత క్రికెట్ జట్టులో స్థానం సంపాదించుకున్న హైదరాబాదీ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ ఎంతో అద్భుతమైన బౌలింగ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు  మొదటగా ఐపీఎల్ లో ఏకంగా రెండు కోట్ల ధర పలికిన మహమ్మద్ సిరాజ్ అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు ఒక ఆటో డ్రైవర్ కొడుకు ఏకంగా ఐపీఎల్ లో భారీగా ధర పలకటంతో ఈ అంశం కొన్ని రోజులపాటు హాట్ టాపిక్ గా మారిపోయింది అయితే ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చిన మొదట బాగానే రాణించాడు. ఆ తర్వాత అంతర్జాతీయ జట్టులో కూడా స్థానం సంపాదించుకున్నాడు. కానీ ఆ తర్వాత ఏమైందో కానీ పేలవ ప్రదర్శనతో అందరిని నిరాశపరిచాడు మహమ్మద్ సిరాజ్.



 ఈ క్రమంలోనే మహమ్మద్ సిరాజ్ కి భారత జట్టులో చోటు దక్కడం కష్టం గా మారిపోయింది ఇలాంటి తరుణంలో సిరాజ్ ఆ తర్వాత అతికష్టంమీద జట్టులో స్థానం సంపాదించుకుని ఇక అద్భుతంగా రాణించాడు. ఇక ప్రస్తుతం భారత జట్టులో కీలక బౌలర్ గా మారిపోయాడు మహమ్మద్ సిరాజ్.  ఇక గత ఏడాది ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన సమయంలో ఏకంగా తన తండ్రి మరణించినప్పటికీ ఎక్కడ కుంగిపోకుండా మనోధైర్యంతో దేశం తరఫున ఆడటమే తన తండ్రి కోరిక తీరుతుంది అని భావించి ఇక పుట్టెడు దుఃఖంలో కూడా దేశం తరఫున అద్భుతంగా రాణించాడు.



 ఇక తాజాగా తన కెరీర్ గురించి మాట్లాడిన మొహమ్మద్ సిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. తనకు ఎప్పుడూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అండగా నిలబడ్డాడు అంటూ చెప్పుకొచ్చాడు.  ఆసీస్ పర్యటనలో ఉన్న సమయంలో తండ్రిని కోల్పోయినా విరాట్ అండ తోనే రాణించాను అంటూ చెప్పుకొచ్చాడు  కన్నీళ్లు పెట్టుకుంటే ఓదార్చాడని..  కోహ్లీ భయ్యా ఇండియా వచ్చినా కూడా తనకు కాల్ చేసి ఎప్పుడూ ధైర్యం చెబుతూ ఉండేవాడు అని సిరాజ్ చెప్పుకొచ్చాడు. తన కెరీర్ మొత్తంలో విరాట్ కోహ్లీ కి రుణపడి ఉంటాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: