ప్రస్తుతం భారత క్రికెట్ లో సురేష్ రైనా కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  భారత క్రికెట్లో స్థానం సంపాదించుకున్న నాటి నుంచి తనదైన శైలిలో రాణిస్తూ ఇక భారత క్రికెట్లో ఒక ప్రత్యేకమైన ఆటగాడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు సురేష్ రైనా.  ఇక ఎన్నో ఏళ్ల పాటు భారత క్రికెట్లో సేవలందించిన సురేష్ రైనా తన ఆటతీరుతో ఎన్నోసార్లు భారత జట్టుకు విజయాలు అందించాడు. ఇక ఆ తర్వాత అవకాశాలు రాక భారత జట్టుకు దూరమయ్యాడు. ఇక మహేంద్ర సింగ్ ధోనీ తన కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన సమయంలోనే ఇక  సురేష్ రైనా కూడా రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్ కి గురి చేశాడు.



 అయితే తన కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ అటు ఐపీఎల్ లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతూ ప్రస్తుతం అభిమానులను అలరిస్తున్నాడు సురేష్ రైనా. అయితే ఇటీవలి కాలంలో సురేష్ రైనా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నాడు  అటు క్రికెట్కు సంబంధించిన పలు విషయాలను అభిమానులతో పంచుకోవడమే కాదు... మరోవైపు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కాగా  ఒకానొక సమయంలో రాహుల్ ద్రావిడ్ తో తనకు ఎదురైన ఒక అనుభవం గురించి ఇటీవలే సురేష్ రైనా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.



 టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ ఓ సమయంలో తన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసి తిట్టాడు అన్న విషయాన్ని ఇటీవల సురేష్ రైనా చెప్పుకొచ్చాడు. ఆరోజు తన తప్పు కూడా ఉండడం వల్ల రాహుల్ ద్రావిడ్ తిట్టాడు అంటూ తెలిపాడు.  2006 సంవత్సరంలో ఓ సిరీస్ ఆడుతున్న సమయంలో FCUk అని పేరు రాసిన టీ షర్ట్ ని ధరించానని..  ఆ సమయంలో రాహుల్ ద్రావిడ్ తన పట్ల ఎంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు అంటూ చెప్పుకొచ్చాడు. నువ్వు ఎలాంటి దుస్తులు ధరించి ఎక్కడ తిరుగుతున్నావో తెలుసా...  నువ్వు భారత క్రికెటర్ అలాంటి పదాలు ఉన్న టీషర్టులు ధరించకూడదు అంటూ రాహుల్ ద్రవిడ్ తిట్టాడు అంటూ సురేష్ రైనా తెలిపాడు. దీంతో వెంటనే ఇక ఆ టి షర్టు నూ చెత్తకుండీలో పడేసాను అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: