కానీ ఆస్ట్రేలియాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో మాత్రం... క్రిస్ గేల్ చేసిన పనులు అందరికీ ఆశ్చర్యానికి గురి చేశాయి. బ్యాటింగ్ వచ్చిన సమయంలో కానీ... ఔటైన తర్వాత కానీ.... ఆస్ట్రేలియా ఆటగాళ్లతో గేల్ వ్యవహరించిన తీరు కానీ చూస్తే... గేల్‌కు ఇదే ఆఖరి మ్యాచ్ అనుకున్నారు అభిమానులంతా. కానీ గేల్ మాత్రం ఓ బాంబ్ పేల్చారు. ఇదే ఆఖరి మ్యాచ్ కాదని.... తన సొంత అభిమానుల ముందు చివరి మ్యాచ్ ఆడాలనేది తన చిరకాల కోరిక అంటూ తన మనసులో మాటను బయట పెట్టారు గేల్. అంతకు ముందు రిటైర్మెంట్ గురించి కనీసం ఒక్క మాట కూడా చెప్పని గేల్.... బ్యాటింగ్ వచ్చినప్పటికీ నుంచి విచిత్రంగానే ప్రవర్తించాడు. గాగుల్స్‌తో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఔటైన తర్వాత... అభిమానులందరికీ అల్వీదా అన్నట్లుగా అభివాదం చేశాడు. విండీస్ ఆటగాళ్లు కూడా గేల్‌కు గౌరవ వందనం సమర్పించారు. అంతా లేచి చప్పట్లు కొట్టారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు కూడా. కానీ ఇదంతా జస్ట్ బిల్డప్ మాత్రమే అని... చివరి మ్యాచ్ కు ఇంకా సమయం ఉందన్నారు క్రిస్ గేల్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి