ప్రస్తుతం విరాట్ కోహ్లీ అభిమానులందరూ షాక్ లో మునిగిపోయారు. దీనికి కారణం బిసిసిఐ తీసుకున్న నిర్ణయమే. ఇటీవలే విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఇక అప్పటి వరకు వైస్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ టీ20 జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్గా నియమించింది బీసీసీఐ . అయితే టీ20 కెప్టెన్గా రోహిత్ శర్మ ను నియమించడం వరకు ఓకే కానీ.. వన్ డే లకు కూడా రోహిత్ శర్మను కెప్టెన్గా బిసిసిఐ నియమిస్తుందా  లేదా కోహ్లీనే కొనసాగిస్తుందా అనేదానిపై గత కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతూనే ఉంది.


 అయితే టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సమయంలో తాను వన్డే టెస్టులకు కెప్టెన్గా కొనసాగుతాను అంటూ విరాట్ కోహ్లీ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో ఇక విరాట్ కోహ్లీ నే వన్డేలో కెప్టెన్గా కొనసాగించే అవకాశం ఉంది అందరూ భావించారు. ఇక వన్డేలో కెప్టెన్గా విరాట్ కోహ్లీకి మంచి రికార్డులు కూడా ఉన్నాయి. కానీ ఊహించని విధంగా బీసీసీఐ ఇటీవలే వన్డే జట్టుకు కెప్టెన్గా రోహిత్ శర్మ ప్రకటించింది. ఇక బిసిసిఐ నిర్ణయం కాస్త అటు అభిమానులందరికీ షాక్ కి గురి చేసింది అని చెప్పాలి. అయితే కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అంటూ టాక్ వినిపిస్తోంది.


 గంగూలీతో తెరమీదకు కనిపించని కోహ్లీ విభేదాలు కూడా కెప్టెన్సీ  నుంచి తప్పించడానికి ఒక కారణమట. రవిశాస్త్రి అండతో విరాట్ కోహ్లీ అన్నింటినీ శాసించే  ప్రయత్నం చేసినట్లు కూడా టాక్ వుంది. ఒక దశలో రోహిత్ శర్మను వైస్ కెప్టెన్సీ గా తప్పించాలని బోర్డుపై  ఒత్తిడి కూడా తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా కోహ్లీ తీరు బీసీసీఐకి ఆగ్రహంతో కలిగించిందట. అయితే టి20 కెప్టెన్సీ  నుంచి తప్పుకోవడం కూడా కోహ్లీ సొంత నిర్ణయం కాదు అనే టాక్ వినిపిస్తోంది. ఇలా సమయం కోసం ఎదురు చూసి ఇక విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పించింది అన్న టాక్ మొదలైంది. ఇప్పుడు ఉన్న టెస్ట్ కెప్టెన్సీపై కూడా గ్యారంటీ లేదని చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్ మెన్ అయిన విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పై దృష్టి పెట్టేందుకు ఇక కెప్టెన్సీ నుంచి తప్పించినట్లు మరికొంతమంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: