టీమిండియా లో కీలక ఆటగాడిగా కెప్టెన్గా కొనసాగుతూ వచ్చిన విరాట్ కోహ్లీ ఇటీవలే అందరికీ ఊహించని షాక్ ఇచ్చాడు. గత ఏడాది జరిగిన టి20 వరల్డ్ కప్ సమయంలోనే టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాను అంటూ ప్రకటించినా విరాట్ కోహ్లీ అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.. విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పిస్తూ బిసిసిఐ నిర్ణయం తీసుకుంది. ఇలా విరాట్ కోహ్లీ నీ కెప్టెన్సీ నుంచి తప్పించడం మాత్రం పెద్ద వివాదంగా మారిపోయింది అని చెప్పాలి. బిసిసిఐకి కోహ్లీ మధ్య చిన్నపాటి మాటల యుద్ధం కూడా నడిచింది. ఇక ఆ తర్వాత కేవలం టెస్టు కెప్టెన్గా మాత్రమే కొనసాగాడు విరాట్ కోహ్లీ. ఇటీవలే  సౌత్ఆఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా టెస్టు సిరీస్ ఆడింది.



 భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా టెస్టు సిరీస్లో ఓటమి చవిచూసింది అన్న విషయం తెలిసిందే. అయితే టెస్ట్ సిరీస్ ఓడిన కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే టెస్ట్ కెప్టెన్సీకి గుడ్ బై చెబుతూ అందరికీ షాకిచ్చాడు విరాట్ కోహ్లీ.. దీంతో గత కొన్ని రోజుల నుంచి భారత క్రికెట్ లో మాత్రమే కాదు అంతర్జాతీయ క్రికెట్లో కూడా కెప్టెన్ గా విరాట్ కోహ్లీ తప్పకపోవడం గురించి చర్చ జరుగుతోంది.ఇక కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి గల కారణాలపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తూ ఉండడం గమనార్హం. ఇటీవలే ఇదే విషయంపై దక్షిణాఫ్రికా మాజీ పేసర్ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.



 తన కుటుంబానికి అండగా ఉండేందుకే విరాట్ కోహ్లీ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు అంటూ అభిప్రాయాన్ని వ్యక్తంచేశాడు దక్షిణాఫ్రికా మాజీ స్టేయిన్. బయో బబుల్స్ కారణంగా కుటుంబానికి దూరంగా ఉండటం ప్రతి ఒక్కరికి ఇబ్బందికరంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. కెప్టెన్సీ నుంచి వైదొలగిన తర్వాత విరాట్ కోహ్లీ తన కుటుంబానికి సమయం కేటాయించడమే కాదు అటు బ్యాటింగ్ పై కూడా దృష్టి పెట్టగలుగుతాడు. అందుకే కోహ్లీ కెప్టెన్సీకి గుడ్బై చెప్పి ఉండవచ్చు అంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుండి తప్పుకోవడంతో   అతని స్థానంలో కొత్త కెప్టెన్  ఎవరు రాబోతున్నారు అన్న చర్చ ప్రస్తుతం ఊపందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: