ఐపీఎల్ సంబంధించి బిసిసిఐ ఎప్పుడు ప్రకటన చేస్తుందా అని అభిమానులు అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ లీగ్ లోకి కొత్తగా రెండు జట్లు లక్నో, అహ్మదాబాద్ లు ఎంట్రీ ఇస్తున్నాయి.  ఈ క్రమంలోనే  బిసిసీఐ ఏ మెగా వేలం నిర్వహించాలని నిర్ణయించింది అనే విషయం తెలిసిందే. అయితే ఇక ఫిబ్రవరి మొదటి వారంలో మెగా వేలం జరగబోతుంది. ఈ మెగా వేలంలో స్టార్ ఆటగాళ్లు కూడా ఉండటంతో పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మెగా వేలం కోసం అటు అభిమానులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఈ ఐపీఎల్ సీజన్ లో ఎంతో మంది దేశీయ ఆటగాళ్లు కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్కు దూరంగా ఉంటున్నాను అంటూ ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు అయితే యూఏఈ వేదికగా కాకుండా భారత్ వేదికగానే ఐపీఎల్ నిర్వహించాలని నిర్ణయించింది బిసిసిఐ. కానీ ప్రస్తుతం భారత్లో కరోనా వైరస్ కేసులు పెరిగి పోతున్న అనే విషయం తెలిసిందే. దీంతో ఇక ఈసారి ఐపీఎల్ సీజన్ బిసిసీఐ ఎక్కడ నిర్వహించబోతోంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే గత కొన్ని రోజుల నుంచి ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి ఎన్నో  వేదికలు తెరమీదికి వస్తూ ఉండడం గమనార్హం. ఒకవేళ  వైరస్ వ్యాప్తి దృశ్య భారత్లో ఐపీఎల్ నిర్వహణ కుదరకపోతే ఎప్పటిలాగానే యూఏఈ వేదికగా బీసీసీఐ ఐపీఎల్ నిర్వహించాలని అనుకుంటుంది అంటూ టాక్ వినిపించింది. ఈసారి యూఏఈ వేదికగా కాదు అటు శ్రీలంక వేదికగా నిర్వహించాలని అనుకుంటుంది అంటూ మరో టాక్ కూడా తెరమీదికి వచ్చింది.


 దీంతో ఐపీఎల్ ఎక్కడ నిర్వహిస్తారు అన్న దానిపై మాత్రం అందరిలో కన్ఫ్యూజన్ ఎక్కువైపోయింది. ఇలాంటి సమయంలోనే బీసీసీఐ ఐపీఎల్ గురించి ఆసక్తికర ప్రకటన చేసింది. మార్చి నెలాఖరు నుంచే ఐపీఎల్ 15 సీజన్ నిర్వహించేందుకు సిద్ధమైనట్లు బిసిసిఐ కార్యదర్శి జై షా తెలిపారు. కొత్త ప్రాంఛైజీలు లక్నో అహ్మదాబాద్ లు కూడా తోడవుతున్న నేపథ్యంలో ఐపీఎల్ భారత్లోనే జరపడానికి మొగ్గుచూపుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఐపీఎల్ సమయానికి  వైరస్ తగ్గుముఖం పట్టని పక్షంలో అప్పుడు ప్రత్యామ్నాయ వేదిక గురించి ఆలోచిస్తాము అంటూ చెప్పుకొచ్చారు. ఐపీఎల్ నిర్వహణ కోసం ఆటగాళ్ల ప్రాణాలను పణంగా పెట్ట లేము అంటూ బీసీసీఐ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl