వరల్డ్ కప్ లో మొదటి మ్యాచ్ నుండి ఓటమై అనేది లేకుండా టైటిల్ ను ఎగరేసుకుపోయిన ఇండియా టీమ్ లో కుర్రాళ్ళు ఫ్రాంచైజీలను ఎంతగానో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా యష్ దుల్ కేవలం ఒక నాయకుడిలా మాత్రమే కాకుండా ఆటగాడిగా కూడా రాణించి జట్టు వరల్డ్ కప్ గెలవడంతో కీలక పాత్రా పోషించాడు. ఇతను ఢిల్లీ వాడు కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఇతనిని వేలంలో దక్కించుకోవడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఓపెనర్ గా రాణించిన ఆంగ్ క్రిష్ రఘువంశీ పై కూడా ఢిల్లీ యాజమాన్యం కన్నేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరినీ దక్కించుకోవడానికి ఎన్ని కోట్లు అయినా కుమ్మరించడానికి సిద్ధం అని తెలుస్తోంది.
మరి ఢిల్లీ క్యాపిటల్స్ వ్యూహం ప్రకారం ఈ కుర్ర ఆటగాళ్లను దక్కించుకుని పటిష్టంగా మారుతుందా? ఇప్పటి వరకు ఐపీఎల్ టైటిల్ గెలవని టీమ్ లలో ఢిల్లీ ఒకటి. ఈసారి అయినా తమకు అదృష్టం కలిసి వచ్చి టైటిల్ ను ముద్దాడుతుందా లేదా అన్నది తెలియాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి