ఇండియా మరియు వెస్ట్ ఇండీస్ ల మధ్య జరుగుతున్న మూడు వన్ డే ల సీరీస్ లో ఈ రోజు రెండవ మ్యాచ్ అహమ్మదాబాద్ వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్ వెస్ట్ ఇండీస్ కు చావో రేవో అన్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు తగినట్లుగా పోలార్డ్ సేన సన్నద్ధం అయి బరిలోకి దిగి అవకాశం ఉంది. ఇంగ్లాండ్ తో టీ 20 సీరీస్ గెలిచిన ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. కేవలం హోల్డర్ తప్ప ఎవ్వరూ అంచనాలకు తగినట్లుగా రాణించలేదు. కనీసం ఈ మ్యాచ్ లో అయినా గెలిచి సీరీస్ డిసైడర్ వరకు వెళుతుందా లేక రెండవ మ్యాట్ కూడా ఓటమి పాలై సీరీస్ ను భారత్ కు ఇస్తుందా అన్నది తెలియాలంటే మ్యాచ్ సమయం వరకు ఆగాల్సిందే.

అయితే ఈ మ్యాచ్ లో వెస్ట్ ఇండీస్ జట్టుకు సంబంధించి కొన్ని మార్పులు చేసే అవకాశం లేకపోలేదు. కానీ ప్రపంచ వ్యాప్తంగా వెస్ట్ ఇండీస్ టీ 20 జట్టుగా ముద్రపడిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అన్ని ఫార్మాట్ లలోనూ మేటి జట్టుగా నిరూపించుకోవాలని గత రెండు సంవత్సరాల నుండి కీరన్ పోలార్డ్ సారధ్యంలో ప్రయత్నిస్తోంది. అయితే ఈ రోజు జరగబోయే రెండవ వన్ డే లో విండీస్ గెలవాలంటే కొన్ని మార్పులు తప్పనిసరి అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.

ముందుగా బ్యాటింగ్ లోనే వీరికి ఎక్కువ సమస్యలు ఉన్నాయి. ఓపెనర్లుగా బరిలోకి దిగుతున్న బ్రాండన్ కింగ్ మరియు షై హోప్ లు మొదట కొన్ని ఓవర్ ల వరకు ఆచి తూచి ఆడాలి. మొదటి పవర్ ప్లే లో వికెట్ కోల్పోకుండా మినిమం 6 రన్ రేట్ ను కొనసాగించాలి. ఇలా చేయడం వలన ఆ తర్వాత వచ్చే ఆటగాళ్లకు ఒత్తిడి తగ్గి స్వేచ్చగా ఆడగలరు. ఇంకా జట్టు యాజమాన్యం నికోలస్ పూరన్, పొలార్డ్, బ్రావో, షమర్ బ్రూక్స్ లాంటి ఆటగాళ్లపై ఎక్కువ నమ్మకం పెట్టుకుంది. అయితే వారు ఆ స్థాయిలో ఆటను కనబరిచి జట్టును విజయ తీరాలకు చేర్చాల్సిన అవసరం ఉంది.

ఒక బౌలింగ్ విభాగంలో కీమర్ రోచ్ దారుణంగా ఫెయిల్ అయ్యాడు. మునుపటిలా రోచ్ కనుక ఫామ్ లోకి వస్తే భారత్ ఆటగాళ్లకు చుక్కలే. స్పెషలిస్టు స్పిన్నర్ అకిల్ హుస్సేన్ సైతం సరైన సమయంలో వికెట్లు తీయడంలో విఫలం అయ్యాడు. మరి చూద్దాం విండీస్ ఓటమి నుండి ఏమైనా నేర్చుకుని గెలుపు బాట పడుతుందా లేదా పటిష్ఠమైన ఇండియా చేతిలో ఓడిపోయి సీరీస్ ను చేజార్చుకుంటుందా చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: