ఇటీవలి కాలంలో అంతర్జాతీయ క్రికెట్ లో రాణించడం భారత సీనియర్లకు చాలా కష్టంగానే మారిపోతుంది. ఎప్పటికప్పుడు యువ ఆటగాళ్లు ఎంట్రీ ఇస్తూ ఉండడం అద్భుతమైన ప్రదర్శనతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ ఉండటం తో ఎన్ని రికార్డులు సాధించినప్పటికీ సీనియర్ ఆటగాళ్లు మాత్రం తమ ప్రతిభను ప్రతి మ్యాచ్ లో నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.  ఇలా నిరూపించుకో లేక పోతున్న సీనియర్ క్రికెటర్లను సెలెక్టర్లు నిర్దాక్షిణ్యంగా పక్కనపెట్టేస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం.



  రహానే, చటేశ్వర్ పుజారా లాంటి ఆటగాళ్లు ఎన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ సద్వినియోగం చేసుకోలేదూ. దీంతో  వారిని పక్కన పెట్టింది బీసీసీఐ. దీంతో మునుపటి ఫామ్ లోకి వచ్చేందుకు రంజీ మ్యాచ్ లు ఆడుతున్నారు. వెటరన్ పేస్ బౌలర్ గా కొనసాగుతున్న ఇషాంత్ శర్మకు ప్రస్తుతం టీమిండియాలో చోటు దక్కడం చాలా కష్టంగానే కనిపిస్తోంది. ఇక ఇప్పుడు జట్టులో ఫాస్ట్ బౌలర్ గా కొనసాగుతున్న భువనేశ్వర్ కుమార్ పరిస్థితి కూడా రానున్న రోజుల్లో అదే జరగబోతోందని తెలుస్తోంది. ఒకప్పుడు తన అద్భుతమైన బౌలింగ్తో టీమిండియాకు ఎన్నోసార్లు విజయాన్ని అందించాడు భువనేశ్వర్ కుమార్.


 కానీ ఇటీవలి కాలంలో  అనుకున్నంత స్థాయిలో రాణించడం లేదు.  బిసిసిఐ పలుమార్లు ఈ సీనియర్ బౌలర్కు అవకాశం ఇచ్చినప్పటికీ తనని తాను నిరూపించుకోలేదు. ప్రస్తుతం వెస్టిండీస్తో జరుగుతున్న టి20 సిరీస్ లో అవకాశం దక్కించుకున్నాడు. అయితే ఇక ఇదే భువనేశ్వర్ కుమార్కు చివరి అవకాశంగా భావించవచ్చు అని విశ్లేషకులు అంటున్నారు. తొలి టి-20లో నాలుగు ఓవర్లు వేసి 30కి పైగా పరుగులు ఇచ్చి ఒకే ఒక్క వికెట్ తీసుకున్నాడు భువనేశ్వర్ కుమార్.  గత ఐపిఎల్ నుంచి అప్పటి భువనేశ్వర్ కనిపించడంలేదు. దక్షిణాఫ్రికా పర్యటన అతనికి పీడకల మిగిల్చింది. బిసిసీఐ సెలెక్టర్లు యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇక ప్రస్తుతం వెస్టిండీస్తో జరుగుతున్న మూడో టీ-20ల సిరీస్ అతని భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉంది విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: