సన్రైజర్స్ హైదరాబాద్ పసికూన గా ఐపీఎల్ లో తన ప్రస్థానం మొదలుపెట్టిన ఈజట్టు తక్కువ సమయంలోనే ఒకసారి ఐపీఎల్ టైటిల్ను కూడా గెలిచింది. అంతేకాదు పలుమార్లు ఫైనల్ వరకు వెళ్లి  కూడా సత్తా చాటింది. అయితే ఐపీఎల్ సీజన్ నుంచి ఏదో ఒక విషయంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు వార్తల్లో నిలుస్తూనే ఉంది అన్న విషయం తెలిసిందే. గతంలో వార్నర్ నీ పక్కన పెట్టడం తో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది అయితే మొన్నటి ఆటగాళ్లు సరైన ప్రదర్శన చేయకపోవడంతో ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో ప్రతిసారి నిరాశపరుస్తూ వచ్చింది హైదరాబాద్ జట్టు. కానీ ఇటీవలే మెగా వేలం నేపథ్యంలో తమ జట్టు రూపురేఖలు అన్నింటినీ కూడామార్చుకుంటూ సరికొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది .


 ఈ క్రమంలోనే ఇక మార్చి చివరిలో ప్రారంభం కాబోయే ఐపీఎల్ 2022 సరికొత్తగా తన ప్రస్థానం మొదలు పెట్టేందుకు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు సిద్ధమైంది. కానీ ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే సన్రైజర్స్ హైదరాబాద్ కు ఊహించని షాక్ తగిలింది అని తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ జట్టు అసిస్టెంట్ కోచ్ గా ఉన్న సైమన్ కటిచ్ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవలే బెంగళూరు వేదికగా జరిగిన మెగా వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ అనుసరించిన వ్యూహాలు నచ్చకపోవడంతోనే అసిస్టెంట్ కోచ్ పదవి కి గుడ్ బై చెబుతూ నిర్ణయం తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది.


 మెగా వేలం సమయంలో ఆటగాళ్ల ఎంపిక కొనుగోలు విషయంలో అటు యాజమాన్యంతో వివాదాలు తలెత్తాయట. దీంతో చివరికి అసిస్టెంట్ కోచ్ పదవికి ఆయన రాజీనామా చేశారట. అయితే గత ఏడాది పేలవా ప్రదర్శనతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. 14 మ్యాచ్ లు ఆడి కేవలం మూడింట్లో మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు నిలిచి అందరిని నిరాశపరిచింది. కానీ ఇప్పుడు మాత్రం మెగా వేలంలో చేతిలోకి తీసుకున్న కొత్త ఆటగాళ్లతో కొత్తగా ప్రస్థానాన్ని ప్రారంభించాలి అనుకుంటున్న సమయంలో ఇప్పుడు అసిస్టెంట్ కోచ్  రాజీనామా హైదరాబాద్ జట్టు యాజమాన్యానికి ఊహించని షాక్ ఇచ్చింది అని అంటున్నారు విశ్లేషకులు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Opl