ఐపీఎల్  ఎంతోమంది క్రికెటర్ల జీవితాన్ని మార్చేసింది. పేదరికంలో మగ్గుతూ ఆర్థిక సమస్యలు వెక్కిరిస్తున్న ఎక్కడ వెనకడుగు వేయకుండా క్రికెట్ ఆట కోసం పోరాడిన ఎంతమంది ప్లేయర్లకు ఐపీఎల్ సరి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. గతంలో ఒక ఆటో వాలా కొడుకు మొహమ్మద్ సిరాజ్ ఐపీఎల్ లో సెలెక్ట్ అయిన తర్వాత ఇక అతని జీవితం మారిపోయింది. ఇక ఇటీవల జరిగిన వేలంలో తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ ఏకంగా 1.7 కోట్ల ముంబై ఇండియన్స్ కొనుగోలు చేయడం సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ లో సెలెక్ట్ అవడం విశేషాలను తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు.


 ఐపీఎల్ మెగా వేలంలో ముంబై ఇండియన్స్ జట్టు తనను కొనుగోలు చేసిందని తెలియగానే తన కోచ్ సంతోషంతో పొంగిపోయాడు అంటూ హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మ అన్నాడు. ఆనందం పట్టలేక భోరున ఏడ్చేశారు.  సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన తిలక్ వర్మ తండ్రి నాగరాజు కోచ్ బజాజ్ ప్రోత్సాహంతోనే క్రికెటర్గా ఎదగాడు. ఇక అండర్-19 జట్టు లో సభ్యుడైన తిలక్ వర్మ విజయ్ హజారే ట్రోపీలో 150 పరుగులు చేసి రాణించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో 215 పరుగులు తో ఆకట్టుకున్నాడు. ఇటీవల జరిగిన మెగా వేలంలో కనీస ధర 20 లక్షలతో బరిలోకి దిగగా 1.70 కోట్లతో ముంబై ఇండియన్స్ అతని దక్కించుకుంది.



 ఐపీఎల్ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కోచ్ తల్లిదండ్రులు ప్రోత్సహించిన తీరును చెప్పుకొచ్చాడు తిలక్ వర్మ. వేలంలో 1.7 కోట్లకు కొనుగోలు చేశారని చెప్పగానే మా కోచ్ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.  పడ్డ కష్టం గుర్తుకు వచ్చే కన్నీటి పర్యంతమయ్యారు. అమ్మా నాన్నకు ఫోన్ చేస్తే వాళ్లు కూడా ఆనందంలో భావోద్వేగానికి లోనయ్యారు. నిజానికి టెన్నిస్ బాల్ తో  ఆట మొదలైంది. ఆ సమయంలోనే నా ప్రతిభను గుర్తించాడు  కోచ్  జాగ్రత్తగా చూసుకుంటూ శిక్షణ ఇచ్చాడు. క్రికెటర్గా ఎదుగుతానని ఆయన ఎంతగానో నమ్మారు. ఇక ఈ క్రమంలోనే మా పేరెంట్స్ కూడా మధ్య తరగతి కుటుంబం అయినప్పటికీ ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు. అండర్ 14 క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒకే ఒక బ్యాట్ ఉండేది. అది మెల్లగా విరిగిపోవడం మొదలయ్యింది. టేపు అతికించి మరిఆట కొనసాగించాను అంటూ తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు...

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl