ముంబై ఇండియన్స్.. ప్రస్తుతం ఐపీఎల్ అభిమానులు అందరూ కూడా ఈ జట్టు గురించి చర్చించు కుంటున్నారు. గతం లో వరుస విజయాలతో దూసుకు పోయి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానాన్ని సొంతం చేసుకుంది ముంబై ఇండియన్స్. ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో విజయ పరంపర కొనసాగింది. ఇప్పటి వరకు  ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో ఐదు సార్లు ఐపీయల్ టైటిల్ గెలిచిన గట్టిగా కూడా కొనసాగుతుంది ముంబై ఇండియన్స్ జట్టు. అతి తక్కువ సమయం లోనే ఇలా ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్స్ గెలిచింది.


 అయితే ఇలా అద్భుతం గా రాణిస్తున్న ముంబై ఇండియన్స్ కు ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో మాత్రం చేదు అనుభవం ఎదురవుతుంది. ఇక రోహిత్ శర్మ తనదైనా కెప్టెన్సీలో జట్టును ముందుకు నడిపిస్తున్న ఎందుకో వరుసగా ముంబై ఇండియన్స్ ఓటమి చవి చూస్తూనే ఉంది. ఇప్పటివరకు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఆడిన మూడు మ్యాచ్ లలో కూడా ఓడిపోవడం గమనార్హం. దీంతో ప్రస్తుతం అభిమానులు అందరూ నిరాశలో మునిగిపోతున్న పరిస్థితి ఏర్పడింది.


 రోహిత్ అలాంటి కెప్టెన్ వుండగా ఇక ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అని అందరూ అవాక్కవుతున్నారు. ఇక ఇదే విషయంపై ఇటీవలే మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ అందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ హాట్రిక్ పరాజయాలకు రోహిత్ శర్మ కెప్టెన్సీ కి అస్సలు సంబంధం లేదు అంటూ చెబుతున్నాడు మహమ్మద్ కైఫ్. సరైన ఆటగాళ్ళు లేకుండా జట్టులో ఎంతటి గొప్ప కెప్టెన్ ఉన్న టీం ని గెలిపించ లేడని అభిప్రాయం వ్యక్తం చేశాడు.  బలహీనమైన సైనికులు ఉన్నప్పుడు ఇక బలమైన రాజు ఉన్న యుద్ధం ఓడిపోవడమే జరుగుతుంది అంటూ తెలిపాడు. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ బౌలింగ్ విభాగం అసలు బాగాలేదు అంటూ వ్యాఖ్యానించాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: