చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో చివరికి గుజరాత్ టైటాన్స్ జట్టు విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ ఓడిపోయినప్పటికీ ఆ జట్టు ఆటగాడు శిఖర్ధావన్ మాత్రం ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి. టి20 ఫార్మాట్ లో వెయ్యి ఫోర్లు బాదిన తొలి భారత క్రికెటర్గా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు శిఖర్ ధావన్. ఇక ప్రపంచ క్రికెట్లో టి20 ఫార్మాట్ లో వెయ్యి ఫోర్లు కొట్టిన 5వ ప్లేయర్ గా నిలిచాడు ధావన్. ఇక టీ-20 ఫార్మెట్లో అత్యధిక ఫోర్లు కొట్టిన జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మొదటి స్థానంలో ఉన్నాడు.
ఇప్పటివరకు క్రిస్ గేల్ టీ-20లో 1132 ఫోర్లు పుట్టాడు. ఇక అతడి తర్వాత అలెక్స్ హేల్స్ 1054 ఫోర్లతో రెండో స్థానంలో ఉన్నాడు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఒక వెయ్యి ఐదు ఫోర్లతో మూడవ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక ఆరోన్ ఫించ్ 1004 ఫోర్లతో 4వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు భారత స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఇలా వెయ్యి ఫోర్లతో ఐదవ స్థానంలో నిలవడం గమనార్హం. భారత ఆటగాళ్ల విషయానికి వస్తే విరాట్ కోహ్లీ 917 ఫోర్లతో రెండో ప్లేస్ లో ఉన్నాడు. రోహిత్ శర్మ 875 కోట్లతో 3వ స్థానంలో ఉండడం గమనార్హం..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి