రోహిత్ శర్మ కెప్టెన్సీ చేపట్టిన తర్వాత ఆ వివాదాలు మరింత ముదురుతాయ్ అని అందరూ అనుకున్నారు. కానీ ఇక రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఒకరికి ఒకరు మద్దతు పలకడం.. ఎంతో సన్నిహితంగా ఉండటం చూసి వివాదాలు అనే వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అని అందరూ అర్థం చేసుకున్నారు. ఇకపోతే ఐపీఎల్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బెంగుళూరులో కీలక ఆటగాడిగా విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. ఇటీవలే ముంబై బెంగళూరు మధ్య మ్యాచ్ జరగ్గా ముంబై ఇండియన్స్ పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది బెంగళూరు జట్టు.
ముంబై ఇండియన్స్ జట్టు ఈ ఓటమితో వరుసగా నాలుగవ ఓటమిని చవిచూసింది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. స్టేడియం లో ఉన్న అభిమానులు బారికేడ్లు దాటుకుని అటు మైదానంలోకి పరుగులు పెట్టి తమ అభిమాన క్రికెటర్లను కలవడానికి వస్తూ ఉంటారు. ఇక ఇటీవలే మ్యాచ్ జరుగుతున్న సమయంలో సెక్యూరిటీ కళ్లుగప్పి ఒక అభిమాని రోహిత్ వైపు దూసుకు వచ్చాడు. హగ్ ఇవ్వాలి అంటూ కోరాడు. మామూలు రోజుల్లో అయితే రోహిత్ హగ్ ఇచ్చేవాడేమో.. కానీ కరోనా వైరస్ నేపథ్యంలో బయో బబుల్ కారణంగా హగ్ ఇవ్వలేకపోయాడు. దీంతో తన వైపు వస్తున్న అభిమానిని చూసి మైదానం నుంచి వెళ్లిపోవాలి అని సూచించాడు. అయినప్పటికీ అతను మాత్రం హగ్ కోసం రోహిత్ వైపు వెళుతుండగా ఇది కరోనా టైం అని హగ్ ఇస్తున్నట్లు చేతులు చాచాడు. ఇక ఫ్యాన్ కూడా చేతులు చాచి ఆనందంగా వెళ్ళి పోయాడు. ఆ సమయంలో క్రీజులో అర్సిబి బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ రోహిత్ అభిమానిని డీల్ చేసిన విధానం చూసి ఫిదా అయ్యాడు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి