మహేంద్ర సింగ్ ధోనీ నుంచి టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్న విరాట్ కోహ్లీ ఎన్నో ఏళ్ల పాటు టీమిండియాను సమర్థవంతంగా ముందుకు నడిపించాడు. మూడు ఫార్మాట్లకు కూడా విజయవంతమైన  కెప్టెన్ గా పేరు సంపాదించుకున్నాడు. కేవలం ఐసీసీ ట్రోఫీ గెలవలేదు అన్న ఒక అపవాదు తప్ప విరాట్ కోహ్లీ కెప్టెన్సీ లో ఎలాంటి రిమార్క్ లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. టీమిండియాకు  ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు విరాట్ కోహ్లీ. అయితే అనూహ్యమైన పరిణామాల నేపథ్యంలో ఇక విరాట్ కోహ్లీ నుంచి  కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు రోహిత్ శర్మ.



 తనదైన వ్యూహాలతో టీమిండియాను ముందుకు నడిపిస్తూ వరుస విజయాలు అందిస్తున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే వయసురీత్యా ఇక రోహిత్ శర్మ ఎక్కువ కాలం పాటు కెప్టెన్గా  కొనసాగడం కష్టమని తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్ ఎవరు అన్న చర్చ ఎప్పుడూ జరుగుతూనే వస్తుంది. అయితే ఇక ఇదే విషయంపై ఇప్పటివరకు స్పందించిన ఎంతో మంది మాజీ ఆటగాళ్లు టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ ఎవరు అనే విషయంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.  అయితే ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న రిషబ్ పంత్ ఫ్యూచర్ కెప్టెన్  అవుతాడు అంటూ ఇటీవల కొత్త వాదన తెరమీదకు వచ్చింది.



 టీమిండియాకు ఫ్యూచర్ కెప్టెన్ రిషబ్ పంత్ మాత్రమే అంటూ భారత మాజీ మహిళా కోడ్ డబ్ల్యూవి రామన్ అన్నారు. ప్రస్తుతానికి రిషబ్ పంత్ కెప్టెన్సీకి సంబంధించి 1,2 విభాగాల్లో మెలకువలు నేర్చుకుంటే సరిపోతుంది అంటు అభిప్రాయం వ్యక్తం చేశాడు. రిషబ్ పంత్ ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడని రామన్ వ్యాఖ్యానించాడు. కాగా ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో రిషబ్ పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచ్ లలో  నాలుగు విజయాలు సాధించి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో కొనసాగుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: