ప్రతిసారి భారీ అంచనాల మధ్య బరిలోకి దిగడం చివరికి పేలవా ప్రదర్శనతో నిరాశ పరచడం కోహ్లీకి అలవాటుగా మారిపోయిందని చెప్పాలి. కొన్ని మ్యాచ్ లలో అయితే ఏకంగా డకౌట్ గా వెను తిరుగుతున్నాడు విరాట్ కోహ్లీ. దీంతో ఇక విరాట్ కోహ్లీ ఆటతీరుపై అభిమానులు మాత్రమే కాదు మాజీ క్రికెటర్లు సైతం స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే కోహ్లిని కొన్నాళ్ళపాటు పక్కన పెట్టడం బెటర్ అంటూ సలహాలు కూడా ఇస్తూ ఉండడం గమనార్హం. ఇటీవల ఇదే విషయంపై బెంగళూరు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ మైఖేల్ హస్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అందరిలాగానే కోహ్లీ కూడా తన ఆట పట్ల విసుగు చెందాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇటీవలే పంజాబ్తో జరిగిన మ్యాచ్లో కూడా 20 పరుగులు చేసి మరోసారి నిరాశపరిచాడు. కోహ్లీ పెవిలియన్ చేరేటప్పుడు తీవ్ర అసహనంతో కనిపించాడు.. ఈ క్రమంలోనే కోహ్లీ గురించి హసన్ మాట్లాడుతూ ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీ బాగా ఆడే లాగే కనిపించాడు. ఇన్నింగ్స్ ను దాటిగా ప్రారంభించడం కోసం తీవ్రంగా శ్రమించాడు. దీంతో మ్యాచ్లో అతను నుండి భారీ ఇన్నింగ్స్ వస్తుందని అనుకున్నామూ. కానీ మరోసారి నిరాశే మిగిలింది. అతను అవుటైన బంతి గ్లౌస్ లకీ తాగుతూ గాల్లోకి వెళ్ళింది. నిజంగా దురదృష్టకరం. కోహ్లీకీ కూడా ఇది బాధగా అనిపించింది అతని బ్యాటింగ్ లో టెక్నికల్ గా కూడా ఎలాంటి సమస్యలు కనిపించ లేదు. కానీ కోహ్లీ కూడా అందరిలాగే విసుగు చెందాడు అంటూ బెంగళూరు డైరెక్టర్ హాసన్ వెల్లడించాడు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి