ఈ క్రమంలోనే 4 ఓవర్లు వేసిన హేజల్ వుడ్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 4 ఓవర్లు వేసి 64 పరుగులు ఇచ్చిన హేజిల్ వుడ్ ఒక్క వికెట్ కూడా తీయకపోయాడు. తద్వారా చెత్త రికార్డును ఖాతాలో వేసుకుని ఏకంగా 16 పరుగుల ఎకనామితో పరుగులు సమర్పించుకున్నాడు. ఐపీఎల్ హిస్టరీ లోనే ఎక్కువ పరుగులు సమర్పించుకున్న విదేశీ బౌలర్ గా అప్రతిష్ఠ మూట కట్టుకున్నాడు. అయితే అంతకు ముందు ఇదే ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ బౌలర్ మార్కో జాన్సన్ గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసి 63 పరుగులు సమర్పించుకున్నాడు. 2021లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున లుంగీ ఎంగిడీ ముంబై ఇండియన్స్ పై 4ఓవర్లు వేసి 61 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు.
ఇప్పుడు హేజల్ వుడ్ ఏకంగా 4 ఓవర్లు వేసి 64 పరుగులు సమర్పించుకోవడమే కాక ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడంతో పాటు అతని బౌలింగ్ బెంగళూరు జట్టుకు ఎక్కడ కలిసి రాలేదనే చెప్పాలి. ఇక గతంలో 2016లో సన్రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్లో 61 పరుగులు సమర్పించుకున్నాడు షేన్ వాట్సన్.. ఇక 2019 సీజన్ లో టీమ్ సౌదీ 61 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. ఇప్పుడు హేజల్ వుడ్ ఏకంగా వాట్సాన్, సౌతిని దాటి తొలి స్థానంలో నిలిచి చెత్త రికార్డును నమోదు చేశాడు.