ఈ ఏడాది సీనియర్ ప్లేయర్ దినేష్ కార్తీక్ ఎంత అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతనికి వయసు మీద పడిపోయిందని కామెంటేటర్గా కొనసాగడం బెటర్ అంటూ అందరూ విమర్శలు చేస్తున్న సమయంలో టీమిండియాలో ఆడాలనే కసి తనలో ఇంకా అలాగే ఉంది అంటూ తన ఆటతీరుతో నిరూపిస్తూ ఉన్నాడు దినేష్ కార్తీక్. గత ఏడాది వరకు కోల్కత్తా జట్టులో కొనసాగిన దినేష్ కార్తీక్.. ఈ ఏడాది బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన ఫినిషర్ పాత్రను పోషిస్తున్నాడు దినేష్ కార్తీక్.


 బెంగళూరు జట్టుకు ప్రతి మ్యాచ్ లో కూడా అద్భుతమైన ఫినిషింగ్ ఇస్తూ అదరగొడుతున్నాడు అని చెప్పాలి. చివరిలో వచ్చి మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ భారీగా పరుగులు చేస్తూ ఉన్నాడు. అతని స్ట్రైక్  రేట్ కూడా రెండు వందలకు పైగానే ఉంది. అంటే అతని ఆటతీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.  ఇకపోతే అటు పంజాబ్ కింగ్స్ జట్టు లివింగ్ స్టోన్ అత్యుత్తమ ఫినిషర్ గా కొనసాగుతున్నాడు. ఇక ఇద్దరు ఫినిషర్ లలో ఎవరు బెస్ట్ అనే దానిపై టీమిండియా మాజీ ఆటగాడు ఆర్పీ సింగ్  స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 లివింగ్ స్టోన్ కంటే దినేష్ కార్తీక్ అత్యుత్తమ ఫినిషెర్ అంటూ చెప్పుకొచ్చాడు.  దినేష్ కార్తీక్ ఆర్సిబి జట్టును చాలా మ్యాచ్ లలో గెలిపించినందుకు లివింగ్ స్టోన్ పైచేయి సాధించాడు అంటూ చెప్పుకొచ్చాడు. అండర్ 19 వరల్డ్ కప్ లో దినేష్ కార్తీక్ నా బ్యాచ్ మేట్. అతను అప్పుడు కూడా రనౌట్ అయ్యేవాడు. ఇప్పుడు కూడా అందులో ఎలాంటి మార్పు లేదు.  అతను ఎక్కువగా ఆలోచిస్తే  ఎక్కువగా తప్పులు చేస్తాడు. అతనికి ఆలోచించడానికి తక్కువ సమయం ఇవ్వండి.. 10 లేదా 20 బంతులు మిగిలి వున్నప్పుడు అతనిలో ఉన్న అత్యుత్తమ బ్యాట్స్ మన్ బయటికి వస్తాడు అంటూ ఆర్పీ సింగ్ చెప్పుకొచ్చాడు. అతని బాడీ లాంగ్వేజిని బట్టి చివరి ఓవర్లలో అతడు ఎంత అద్భుతమైన ఆటగాడు అన్నది తెలుస్తుంది. ఇక లివింగ్ స్టోన్ తో పోలిస్తే దినేష్ కార్తీక్ అద్భుతమైన ఫినిశర్ అంటూ నేను భావిస్తున్నాను అటు తెలిపాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl