ఐపీఎల్లో ఓటమితో ప్రస్థానం మొదలుపెట్టిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు రెండు ఓటముల తర్వాత అనూహ్యంగా పుంజుకుని వరుసగా ఐదు విజయాలు సాధించింది. ప్రత్యర్థి జట్టు పై పూర్తి ఆధిపత్యం కొనసాగింది. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. వరుసగా ఓటమూల బాట పట్టింది సన్రైజర్స్. ఇక ఇటీవల కోల్కతా నైట్రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ప్లే ఆఫ్ అవకాశాలను  సజీవంగా ఉంచుకోవడానికి తప్పక గెలవాల్సిన మ్యాచ్లో చివరికి ఓటమి చవిచూసింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.


 కనీస పోటీ ఇవ్వలేక పోయింది అని చెప్పాలి. మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్రైడర్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ విభాగం చేతులెత్తేయడంతో 55 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో సన్రైజర్స్ కి ప్లే ఆఫ్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారిపోయాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఓటమి పై స్పందించిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 తాను చేసిన తప్పిదాల కారణంగానే సన్రైజర్స్ ఓటమి పాలు అయింది అంటూ చెప్పుకొచ్చాడు. చివరి ఓవర్లో వాషింగ్టన్ సుందర్ తో బౌలింగ్ వేయించకుండా ఉండాల్సింది అంటూ తెలిపాడు. అతనితో బౌలింగ్ వేయించడం మిస్ ఫైర్ అయిందని తన తప్పిదాన్ని అంగీకరించాడు. ఆలోచన లేకుండా బౌలింగ్ వనరులను ముందుగానే వినియోగించుకున్న కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది అంటు చెప్పుకొచ్చాడు. ఇక ఆండ్రూ రస్సెల్ చెలరేగడంతో ఒక్కసారిగా మ్యాచ్ పరిస్థితులు మారిపోయాయి అంటూ తెలిపాడు.. ఈ క్రమంలోనే సన్రైజర్స్ ఆడబోయే రెండు మ్యాచ్ లలో భారీ విజయం సాధించడంతో పాటు మిగతా  జట్లు ఓటమిపై కూడా సన్రైజర్స్ ప్లే ఆఫ్ కు వెళ్లడం ఆధారపడాల్సి వచ్చింది. దీంతో ప్రస్తుతం సన్రైజర్స్ ప్లే ఆఫ్ వెళ్తుందా లేదా అన్నది మాత్రం అనుమానంగానే మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl